భీమవరంలో ఆక్వా రైతులతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఊహించని పరిస్థితి ఎదురైంది. జగన్ గారు స్టేజ్ పైకి ఎక్కిన సమయంలో, కార్యకర్తల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో స్టేజ్ ఊగిపోయింది. అభిమానం అతి కావడంతో కార్యకర్తలు స్టేజ్‌ను కుదిపేయడం అక్కడ కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో జగన్ గారు పడబోయి తృటిలో తప్పించుకున్నారు.