అన్వేషించండి

Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్

Addepalli brother: నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల దందా చేశారని పోలీసులు గుర్తించారు. విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.

Jogi Ramesh support for Addepalli brothers fake liquor:  ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ పాత్రను నిర్దారిస్తూ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.  అన్నమయ్య జిల్లా ములకలచెరువు, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ అండతోనే అద్దేపల్లి సోదరులు నకిలీ మద్యం వ్యాపారాన్ని నడిపారని  తెలిపారు. జోగి రమేష్  మంత్రి పదవి కాలంలోనే ఈ దందా మొదలైందని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. సహకారానికి ప్రతిఫలంగా లంచాలు ముట్టజెప్పినట్లు పేర్కొన్న చార్జ్ షీట్‌ లో పేర్కొన్నారు.   ఈ ప్రాథమిక అభియోగపత్రంలో 8 మంది నిందితుల్ని చేర్చారు 

ఎక్సైజ్ పోలీసులు దాఖలు చేసిన 540 పేజీల చార్జ్ షీట్‌లో జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము ఇద్దరూ  అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహన్‌రావులతో దీర్ఘకాలిక ఆర్థిక, వ్యాపార బంధాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలిపారు.  2006-2019 మధ్య స్వర్ణ బార్‌లో భాగస్వాములుగా ఉండి, 2013లో బాలాజీ బార్ కొనుగోలు చేసి 2019లో చెర్రీస్ బార్‌గా మార్చారని, తర్వాత ఏఎన్‌ఆర్ రెస్టారెంట్ అండ్ బార్‌గా మార్చారని ఆధారాలు చూపించారు.  జోగి రమేష్ మంత్రిగా ఉన్న 2022 జూన్‌లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్ ఏర్పాటు చేశారు. ములకలచెరువులో కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి, సీసాలు, స్పిరిట్, మూతలు, లేబుల్స్ సరఫరా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. లేబుల్స్ డిజైన్‌లో N.రవి (A-4), తిరుమలశెట్టి శ్రీనివాసరావు (A-13) కీలక పాత్ర పోషించారు. సీసాల సరఫరా శ్రీనివాసరెడ్డి (A-11), బాట్లింగ్‌లో బాదల్ దాస్ (A-7), ప్రదీప్‌దాస్ (A-8) చచేశారు. విజయవాడలో శ్రీనివాస వైన్స్‌లో కల్యాణ్ (A-12) అమ్మకాలు చేశాడు.

సహకారానికి ప్రతిఫలంగా 2-3 నెలలకు ఒకసారి రూ.3-5 లక్షలు లంచాలు ముట్టజెప్పారు. 2022 జూన్‌లో జనార్దనరావు బ్యాంకు నుంచి రూ.8 లక్షలు, మరోసారి రూ.9 లక్షలు డ్రా చేసి, అందులో రూ.4-5 లక్షలు జోగి రాముకు అందజేశారు. 2021-2025 మధ్య అద్దేపల్లి సోదరుల ఖాతాల నుంచి పెద్ద మొత్తాలు విత్‌డ్రా చేసి, లంచాలకు ఉపయోగించారు. జనార్దనరావు, జోగి రాము మధ్య తరచు ఫోన్ కాల్స్, యూపీఐ లావాదేవీలు ఆధారాలు చార్జిషీట్‌కు జతచేశారు. 
 
ప్రధాన నిందితుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు కస్టడీలో జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేశాను అని అంగీకరించాడు. సెప్టెంబర్ 23న ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ఇంటికి వెళ్లి చర్చించినట్లు వెల్లడించాడు. జోగి ఇంటి సీసీ కెమెరా డీవీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దుష్ప్రచారం చేసేందకు  యత్నాలు జరిగాయని ఊరూరా నకిలీ మద్యం తయారవుతోంది అనే ప్రచారం చేశారని పోలీసులు పేర్కొన్నారు. చార్జ్ షీట్‌లో ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రస్తుతం  జోగి రమేష్ సోదరులు జైల్లో ఉన్నారు.                             

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Advertisement

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget