Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
Akhanda 2 Thaandavam Release Issues: 'అఖండ 2' వాయిదా పడితే అనూహ్యంగా 'హరిహర వీరమల్లు' విడుదల సమయంలో జరిగిన విషయాలు తవ్వి తీశారు కొందరు. అసలు ఆ రెండిటికీ, ఆ రెండు సినిమాలనూ కంపేర్ చేయడం ఎందుకు??

కరోనా తర్వాత భారీ ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమా 'అఖండ'. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. థియేటర్లకు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు వేసుకొచ్చారు. అటువంటి సినిమాకు సీక్వెల్ 'అఖండ 2 తాండవం'. పైగా, సనాతన ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్.
దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సినిమా 'అఖండ 2 తాండవం'. ఆఖరి నిమిషంలో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు వస్తాయని అసలు ఎవరూ ఊహించలేదు. ప్రీమియర్స్ సమయానికి కొన్ని గంటల ముందు పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. అఖండ 2 వాయిదా పడ్డాక అనూహ్యంగా 'హరిహర వీరమల్లు' విడుదల సమయంలో జరిగిన పరిస్థితులను తవ్వి తీశారు కొందరు. అసలు, రెండిటి మధ్య కంపేరిజన్ ఎందుకు? రెండు సినిమాల్లో హీరోల ప్రస్తావన ఎందుకు?
వీరమల్లు vs అఖండ 2...
ఎందుకు కంపేర్ చేయలేం!?
'వీరమల్లు'కు దర్శకుడు మారారు. క్రిష్ మొదలు పెట్టిన సినిమాను జ్యోతికృష్ణ పూర్తి చేస్తారు. ఐదేళ్ల పాటు నిర్మాణంలో ఉంది. విడుదలకు ముందు సినిమాపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో అభిమానులు 'ఓజీ ఓజీ' అని నినాదాలు చేశారు గానీ వీరమల్లు కోసం ఆసక్తి చూపించిన సందర్భాలు తక్కువ. వీరమల్లు సినిమాకు ముందు ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు 'అఖండ 2' విడుదలకు ముందు సినిమాపై ఉన్న అంచనాలు వేరు. అందువల్ల, ఆ రెండిటినీ కంపేర్ చేయడం తగదు.
బాలకృష్ణ vs పవన్ కళ్యాణ్...
ఇద్దరి మధ్య కంపేరిజన్ ఎందుకు?
'అఖండ 2 తాండవం' వాయిదా / రిలీజ్ క్యాన్సిల్ తర్వాత బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంపేరిజన్ తీసుకు వస్తున్నారు కొందరు. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన భాగస్వాములు. టీడీపీ నుంచి మూడుసార్లు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పెద్ద అల్లుడు నారా లోకేష్ మంత్రిగా, చిన్న అల్లుడు భరత్ ఎంపీగా ఉన్నారు. హిందూపూర్ నుంచి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
Also Read'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?
ఏపీ ప్రభుత్వంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఓ సినిమా ఐదేళ్ల పాటు నిర్మాణంలో ఉన్నప్పటికీ, బజ్ తక్కువైనప్పటికీ, విడుదలకు ఒక్క రోజు ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ... విడుదలకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సినిమా థియేటర్లలోకి వచ్చేలా చేశారు పవన్ కళ్యాణ్. వీరమల్లు నిర్మాత ఏఎం రత్నానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే తన నెక్స్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తనతో 'బ్రో' చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలతో మాట్లాడి 30 కోట్లు ఏర్పాటు చేశారు. వీరమల్లుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ తన సినిమా విడుదల చేసుకోగలిగారని, బాలకృష్ణ అలా చేయలేదని విమర్శలు చేస్తున్న వ్యక్తులు కొందరు ఉన్నారు.
Also Read: 'అఖండ 2' రిలీజ్... ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి? ఎప్పుడొస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయ్?
విడుదల వివాదంలో ప్రభుత్వానికి ప్రమేయం లేదని విమర్శలు చేసే వ్యక్తులు గుర్తిస్తే మంచిది. అక్కడ పవన్ ఏర్పాటు చేసింది లేదా చేయించినది 30 కోట్లు. ఇక్కడ 'అఖండ 2' విడుదలకు కావల్సింది సుమారు 70 కోట్లకు పైమాటే. అంత భారీ అమౌంట్ అడ్జస్ట్ చేయడం రిస్కుతో కూడుకున్న వ్యవహారం. రిటర్న్స్ ఎప్పుడు వస్తాయనేది చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ అమౌంట్ అడ్జస్ట్ చేయడానికి రీజన్ పవన్ నెక్స్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉండటం, ప్రీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేయడానికి కారణం పవన్ హీరోగా మరో సినిమా చేసే సన్నాహాల్లో ఉండటం.
బాలకృష్ణ నెక్స్ట్ సినిమాల నిర్మాతలు అడ్జస్ట్ చేయడానికి, 'అఖండ 2' విడుదల చేయించడానికి ఇక్కడ కొండంత అమౌంట్ ఉంది. బాలకృష్ణ రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినా సరిపోదు. బోయపాటి శ్రీను ఇచ్చినా సరిపోదు. బాలయ్య ఒక మాట చెప్పినా తెగే సమస్య కాదు. ఆయన రియాక్ట్ అవ్వలేదని అనడం సరికాదు. అసలు ఆ ఎరోస్ కోర్టు కేసు, అమౌంట్ ఇష్యూ 'అఖండ 2'కు సంబంధించినది కాదు. కోర్టు చిక్కుల్లో ఉంది. 'దూకుడు', 'ఆగడు' టైం నుంచి ఉన్నది. నిర్మాతల గత సినిమాల ఫైనాన్షియల్ సమస్యలను బాలయ్యకు ముడి పెట్టడం కరెక్ట్ కాదు. 'అఖండ 2 తాండవం' ఫైనాన్షియల్ ఇష్యూస్ కొంత ఉన్నాయనుకోండి. అవి క్లియర్ చేయాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంది. అందుకని బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కంపేరిజన్ కూడా కరెక్ట్ కాదు.





















