అన్వేషించండి

Akhanda 2 Postponed: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?

Reasons For Akhanda 2 Postponed: 'అఖండ 2' విడుదల వాయిదా పడింది. అయితే ఎందుకు? అనేది అభిమానులు ఎంతో మందిని తొలిచివేస్తున్న ప్రశ్న. అందుకు గల కారణాలు...

Akhanda 2 postponed reasons: ఇటు ఇండియా, అటు అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'అఖండ 2' తాండవం చేయాల్సిన సమయమిది. అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా అనేది బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులకు పిడుగు లాంటి వార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇవ్వడంతో ఇక షోలు పడటమే ఆలస్యం అనుకున్న తరుణంలో... తొలుత ప్రీమియర్స్, ఆ తర్వాత విడుదల క్యాన్సిల్ అయ్యింది. వాయిదా పడినట్టు 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. అసలు వాయిదాకు కారణాలు ఏమిటి? అంటే... 

'అఖండ 2' విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే!
Madras High Court Stay On Akhanda 2 Release: 'అఖండ 2' విడుదలపై మద్రాస్ హైకోర్టు డిసెంబర్ 3వ తేదీన స్టే ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు డబ్బులు ఇవ్వాలని, తమ బాకీలు తీర్చే వరకు సినిమా విడుదలపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఎరోస్ ఒక్కటేనా... ఫైనాన్షియర్ల మాట కూడా!
ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక్కటే కాదు... 'అఖండ 2'కు డబ్బులు సమకూర్చిన ఫైనాన్షియర్లు సైతం సినిమా విడుదలకు అడ్డు పడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'అఖండ 2'కు ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మరొక ముగ్గురు ఫైనాన్స్ చేశారు. వాళ్ళ అమౌంట్ సెటిల్ చేయలేదట. దాంతో విడుదలకు ముందు రోజు ల్యాబ్ దగ్గర నుంచి క్లియరెన్స్ రాలేదట. ఎరోస్ ఒక్కటే కాదు అని... ఫైనాన్షియర్లతో పాటు నిర్మాతలు క్లియర్ చేయాల్సిన బాకీలు ఇంకా ఉన్నాయని టాక్.

'సర్కారు వారి పాట'ను వదిలేసి 'అఖండ 2'ను...
అసలు 14 రీల్స్ ప్లస్, ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య గొడవ ఏమిటి? ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విడుదల అయినప్పుడు, 'అఖండ 2' ఎందుకు ఆగింది? అంటే... సమస్య ఇప్పటిది కాదు.

నిజానికి 14 రీల్స్ ప్లస్, ఎరోస్ మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జారలేదు. కానీ 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట భాగస్వాములు అయిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (అనిల్ సుంకర మరో భాగస్వామి), ఎరోస్ మధ్య మహేష్ బాబు 'దూకుడు' నిర్మాణంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అప్పట్లో 14 రీల్స్, ఎరోస్ మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది. దాంతో గొడవలు మొదలు అయ్యాయి. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా కూడా కాదు... పెద్ద సునామీగా మారింది. 'సర్కారు వారి పాట' విడుదల సమయంలో మౌనంగా ఉన్న ఎరోస్ ఇప్పుడు 'అఖండ 2' విడుదల మీద స్టే కోరింది. వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

14 రీల్స్ & ఎరోస్ మధ్య కేసు ఎప్పట్నించి ఉంది?
14 రీల్స్ లేదా 14 రీల్స్ ప్లస్ & ఎరోస్ మధ్య కోర్టు కేసులు కొన్నేళ్ల నుంచి నానుతూ ఉన్నాయి. తమ డబ్బులు ఇవ్వాలని కొన్నేళ్ల క్రితం ఎరోస్ ట్రిబ్యులన్‌కు వెళ్లగా... 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాని సవాల్ చేస్తూ 2020లో మద్రాస్ హైకోర్టుకు, 2021లో డివిజన్ బెంచ్, ఆగస్టు 2021లో సుప్రీమ్ కోర్టుకు 14 రీల్స్ వెళ్ళింది. కానీ ఒక్క రూపాయి కట్టలేదు. పైగా 14 రీల్స్ సంస్థకు అనుకూలంగా తీర్పు రాలేదు.

Also ReadBhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?

'అఖండ 2' విడుదలపై  ఎరోస్ స్టే కోరగా... 14 రీల్స్ ప్లస్ సంస్థపై తీసిన సినిమా అని నిర్మాతలు కోర్టుకు తెలిపారు. అయితే... 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ వేర్వేరు కాదని, రెండు సంస్థల్లో భాగస్వాములు రామ్ ఆచంట, గోపి ఆచంట అని ప్రూవ్ చేయడంలో ఎరోస్ సక్సెస్ అయ్యింది. దాంతో 28 కోట్ల రూపాయలకు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆ డబ్బులు కట్టడంతో పాటు లోకల్ ఫైనాన్షియర్లకు సెటిల్ చేస్తే సినిమా విడుదల అవుతుంది.

Also ReadSamantha Wedding Saree: సమంత పెళ్లి ఫోటోలు... పువ్వల్లే సామ్ నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ చూడండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: గురువారం (ఫిబ్రవరి 19) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
గురువారం (ఫిబ్రవరి 19) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Vijay Deverakonda Rashmika Net Worth : విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్! - క్యూట్ కపుల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్! - క్యూట్ కపుల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Vishnu Vinyasam Teaser : లవర్‌కే మ్యాచ్ చూడాల్సి వస్తే... - చిన్ను గాడి వాస్తు పిచ్చి ఎలా మారిందో?... ఇంట్రెస్టింగ్‌గా విష్ణు విన్యాసం టీజర్
లవర్‌కే మ్యాచ్ చూడాల్సి వస్తే... - చిన్ను గాడి వాస్తు పిచ్చి ఎలా మారిందో?... ఇంట్రెస్టింగ్‌గా విష్ణు విన్యాసం టీజర్
Toxic Movie Story : యశ్ 'టాక్సిక్' మూవీ స్టోరీ లైన్ ఇదేనా! - KGFను మించి చూస్తామా?
యశ్ 'టాక్సిక్' మూవీ స్టోరీ లైన్ ఇదేనా! - KGFను మించి చూస్తామా?
Advertisement

వీడియోలు

Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
Sunil Gavaskar Advice to Abhishek Sharma | అభిషేక్ ఫామ్‌పై గావస్కర్ కీలక వ్యాఖ్యలు
Usman Tariq inspired by MS Dhoni | పాక్ బౌలర్ జీవితాన్ని మార్చిన ఎంఎస్ ధోని
India vs Netherlands T20 World Cup 2026 | ఇండియా తుది జట్టులో కీలక మార్పులు?
Mohammed Shami 8 Wickets in Ranji Trophy | రంజీ సెమీస్‌లో షమీ విధ్వంసం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambati Rambabu release: కూటమిని కూల్చే వరకూ పోరాడతా - జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు శపథం
కూటమిని కూల్చే వరకూ పోరాడతా - జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు శపథం
Influencer Badluck: లైవ్‌లో బ్యూటీ ఫిల్టర్ పని చేయలేదు- తీరా చేస్తే లక్షన్నర మంది ఫాలోయర్లు జంప్ - పాపం అందగత్తె!
లైవ్‌లో బ్యూటీ ఫిల్టర్ పని చేయలేదు- తీరా చేస్తే లక్షన్నర మంది ఫాలోయర్లు జంప్ - పాపం అందగత్తె!
Spying in India : దేశ రహస్యాలు లీక్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అరెస్ట్ నుంచి శిక్ష వరకు పూర్తి వివరాలివే
దేశ రహస్యాలు లీక్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అరెస్ట్ నుంచి శిక్ష వరకు పూర్తి వివరాలివే
Tirumala: తిరుమలలో స్మార్ట్ సౌకర్యం - చెప్పుల ట్రాకింగ్ వ్యవస్థకు భక్తుల ప్రశంసలు
తిరుమలలో స్మార్ట్ సౌకర్యం - చెప్పుల ట్రాకింగ్ వ్యవస్థకు భక్తుల ప్రశంసలు
Vishnu Vinyasam Teaser : లవర్‌కే మ్యాచ్ చూడాల్సి వస్తే... - చిన్ను గాడి వాస్తు పిచ్చి ఎలా మారిందో?... ఇంట్రెస్టింగ్‌గా విష్ణు విన్యాసం టీజర్
లవర్‌కే మ్యాచ్ చూడాల్సి వస్తే... - చిన్ను గాడి వాస్తు పిచ్చి ఎలా మారిందో?... ఇంట్రెస్టింగ్‌గా విష్ణు విన్యాసం టీజర్
Vijay Deverakonda Rashmika Net Worth : విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్! - క్యూట్ కపుల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్! - క్యూట్ కపుల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Pak vs Nam Highlights: టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 8లోకి పాకిస్తాన్‌! నమీబియాపై 102 పరుగుల తేడాతో ఘన విజయం!
టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 8లోకి పాకిస్తాన్‌! నమీబియాపై 102 పరుగుల తేడాతో ఘన విజయం!
India AI Impact Summit 2026: AI, ADAS ఫీచర్లతో స్కూటర్‌! ప్రయాణం ఎలా సులభతరం అవుతుంది?
AI, ADAS ఫీచర్లతో స్కూటర్‌! ప్రయాణం ఎలా సులభతరం అవుతుంది?
Embed widget