వీరమల్లుకు ముందు పవన్ పాడిన సాంగ్స్ ఏవో తెలుసా?

పవన్ సింగర్ కూడా! అప్పుడప్పుడూ పాటల్లో గొంతు వినిపిస్తూ ఉంటారు. ఆయన ఏయే సినిమాల్లో పాడారు? ఏయే పాటలు పాడారు? అంటే...

'హరిహర వీరమల్లు' సినిమాలో 'మాట వినాలి' పాటను పవన్ స్వయంగా పాడారు. మరి దానికి ముందు?

'అత్తారింటికి దారేది'లో 'కాటమరాయుడా కదిరీ నరసింహుడా' పాటను పాడింది పవనే. 

'అజ్ఞాతవాసి' సినిమాలో 'కొడకా కోటేశ్వరరావు' కూడా పవన్ పాడిన పాటే.

సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ సాంగ్ 'తమ్ముడు'లో ఉంది. ఆ సినిమాలోని 'తాటి చెట్టు...', 'ఏం పిల్లా' బిట్ సాంగ్స్ పాడారు.

'ఖుషి' సినిమాలో పవన్ పాడిన 'బై బైయ్యే బంగారు రమణమ్మ...' సాంగ్ విపరీతంగా వైరల్ అయ్యింది. 

పవన్ డైరెక్ట్ చేసిన 'జానీ'లో  రెండు పాటలు 'నువ్వు సారా తాగకు...', 'రావోయి మా ఇంటికి' సాంగ్స్ ఆయనే పాడారు.

'గుడుంబా శంకర్' సినిమాలోని 'కిల్లి కిల్లి...' సాంగ్ స్టార్టింగ్ పోర్షన్ పాడింది పవనే. 

'పంజా'లో బ్రహ్మానందం మీద వచ్చే 'పాపారాయుడు' పాట కూడా ఆయనే పాడారు.

నెక్స్ట్ ఏ సినిమాలో పవన్ పాడతారో? వెయిట్ అండ్ సి.