'హనుమాన్'తో తేజా సజ్జా పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. హీరో కంటే ముందు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్.

బాలనటుడిగా తేజా సజ్జా సుమారు 24 సినిమాల్లో నటించారు. అందులో హిట్స్ & మెమరబుల్ రోల్స్ ఏవో చూడండి.

చైల్డ్ ఆర్టిస్టుగా తేజా సజ్జా అంటే మొదట గుర్తుకు వచ్చే సినిమా 'ఇంద్ర'. అందులోని 'నేనున్నాను నయనమ్మా' డైలాగ్. 

'రాజకుమారుడు' సినిమాలో వెంగల రాయుడు క్యారెక్టర్ కూడా తేజా సజ్జాకు మంచి పేరు తెచ్చింది.

పవన్ కళ్యాణ్ 'బాలు' సినిమాలోనూ తేజా సజ్జా నటించారు. అందులో కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు.

వెంకటేష్ 'కలిసుందాం రా'లో బాల నటుడిగా... 'లక్ష్మి' సినిమాలో చిన్నప్పటి వెంకీగా నటించారు. 

ఎన్టీఆర్ 'అడివి రాముడు', 'సాంబ', 'నా అల్లుడు' సినిమాల్లోనూ తేజా రోజా నటించారు. 'నా అల్లుడు'లో డ్యూయల్ రోల్ చేశారు.

'ఇంద్ర' తర్వాత చిరంజీవి 'చూడాలని ఉంది', 'ఠాగూర్', 'అందరివాడు' సినిమాల్లోనూ తేజా సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు.

బాల నటుడిగా తేజా సజ్జా చివరి సినిమా నాగార్జున 'బాస్'. ఆ తర్వాత నటుడిగా తెరపైకి వచ్చారు.

సమంత 'ఓ బేబీ'లో మనవడి రోల్ చేసిన అతడు... 'జాంబీ రెడ్డి'తో హీరోగా మారారు.