నాని థియేట్రికల్ మార్కెట్ ఎంత? ఏవరేజ్ ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? వచ్చేది చూస్తే...

'హిట్ 3'తో పాటు దానికి ముందు న్యాచురల్ స్టార్ నాని 10 ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ చూడండి.

'హిట్ 3' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 48.50 కోట్లు.

'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్లు

'హాయ్ నాన్న' క్లాస్ ఫిల్మ్ కావడంతో తక్కువ బిజినెస్ చేసింది. ఆ మూవీ బిజినెస్ రూ. 27.60 కోట్లు.

నాని కెరీర్ బెస్ట్ & టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే 'దసరా'. ఆ మూవీ రైట్స్ రూ. 50 కోట్లకు అమ్మారు.

'అంటే సుందరానికి' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 30 కోట్లు

'శ్యామ్ సింగ రాయ్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22 కోట్లు

'నానీస్ గ్యాంగ్ లీడర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 28 కోట్లు.

నాని కెరీర్‌లో క్లాసికల్ హిట్ 'జెర్సీ' ప్రీ రిలీజ్ బిజిజెస్ రూ. 26 కోట్లు.

నాగార్జునతో కలిసి చేసిన మల్టీస్టారర్ 'దేవ్‌దాస్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 37.20 కోట్లు.

నాని డ్యూయల్ రోల్ చేసిన సినిమా 'కృష్ణార్జున యుద్ధం'. ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 26 కోట్లు.

నాని కెరీర్‌లో ఫస్ట్ 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసిఏ). ఆ మూవీ రైట్స్ రూ. 30 కోట్లకు అమ్మారు.

నాని లాస్ట్ 10 ఫిలిమ్స్ (మల్టీస్టారర్ దేవ్‌దాస్ తీసేసి) బిజినెస్ ఏవరేజ్ తీస్తే... ఒక్కో మూవీకి 32.91 కోట్లు వచ్చాయి.