టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన 'దిల్' రాజు కొత్త హీరోలతో తీసిన హిట్ సినిమాలు ఏవో తెలుసా?

వెంకట రమణారెడ్డి తొలి సినిమా 'దిల్'. దాంతో ఆయన పేరు 'దిల్' రాజు అయ్యింది. హీరోగా నితిన్ రెండో చిత్రమిది.

'దిల్' తర్వాత అల్లు అర్జున్ హీరోగా 'ఆర్య' తీశారు. 'గంగోత్రి' తర్వాత బన్నీని హీరోగా నిలబెట్టిన చిత్రమిది.

దిల్ రాజుకు 'బొమ్మరిల్లు' లాభాలు, పేరు తెచ్చింది. అప్పటికి సిద్ధార్థ్ స్టార్. 'బాయ్స్', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చేశారు. 

'హ్యాపీ డేస్'తో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్‌కు సోలో హీరోగా 'కొత్త బంగారు లోకం' వంటి హిట్ ఇచ్చారు దిల్ రాజు.

'రేయ్' రిలీజ్ ఆగితే గీతా ఆర్ట్స్‌తో కలిసి 'పిల్లా నువ్వులేని జీవితం' తీసి మెగా మేనల్లుడు సాయి తేజ్‌కు హిట్ ఇచ్చారు. హీరోగా మంచి ఎంట్రీ ఇచ్చారు.

'రౌడీ బాయ్స్'తో తన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేసి హిట్ ఇచ్చారు దిల్ రాజు. 

సమంత 'శాకుంతలం' హిట్ కాదు గానీ... అల్లు అర్జున్ కుమార్తె అర్హను ప్రిన్స్ భరత పాత్రలో పరిచయం చేశారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో దిల్ రాజు సినిమాలు చేశారు.

బన్నీ, నితిన్ స్టార్స్ అవ్వక ముందు వాళ్ళతో 'దిల్' తీసిన ఫిలిమ్స్ హిట్. అలాగే, కొత్త హీరోలతో ఆయన చేసిన సినిమాలు హిట్స్.