పెళ్లైన తర్వాత హీరోయిన్‌గా... ఈ నార్త్ ఇండియా బ్యూటీ ఎవరో తెలుసా?

'మళ్ళీ రావా'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నార్త్ ఇండియన్ బ్యూటీ ఆకాంక్ష సింగ్.

నాగార్జునతో 'దేవదాస్', ఆది పినిశెట్టితో 'క్లాప్', నవీన్ చంద్రతో 'పరంపర' వెబ్ సిరీస్ చేశారు. 

పెళ్లైన తర్వాత ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేశారని తెలుసా? ఆమె భర్త పేరు కునాల్ సైన్.

హిందీ టీవీ సీరియల్ 'నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా'తో ఆకాంక్ష సింగ్ నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. 

ఆకాంక్ష సింగ్ మొదటి సీరియల్ 2012లో ప్రసారం అయితే... 2014లో ఆవిడ పెళ్లి చేసుకున్నారు.

హీరోయిన్‌గా ఆకాంక్ష మొదటి సినిమా 'మళ్ళీ రావా' (2017)లో వచ్చింది. దానికి ముందు 'బద్రీనాథ్ కి దుల్హనియా'లో ఆలియా అక్కగా చేశారు. 

వృత్తిరీత్యా ఆకాంక్ష సింగ్ ఫిజియోథెరపిస్ట్. ఆమె భర్త కునాల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్.

కన్నడలో సుదీప్ 'పహిల్వాన్', హిందీలో అజయ్ దేవగణ్ 'రన్ వే 34' సినిమాలూ చేశారు ఆకాంక్ష సింగ్. 

హిందీలో 'రంగబాజ్', 'రణ్ నీతి', 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' వెబ్ సిరీస్‌లలో ఆకాంక్ష నటించారు.

తెలుగులో 'షష్టిపూర్తి' సినిమాతో పాటు 'మీట్ క్యూట్', 'బెంచ్ లైఫ్' వెబ్ సిరీస్‌లు చేశారు ఆకాంక్ష.