మార్వాడి ఫ్యామిలీ అమ్మాయి... హైదరాబాదీ... అందాల నిధి పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ తెలుసా?

'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ అందుకున్న నిధి... హిందీ సినిమా 'మున్నా మైఖేల్'తో హీరోయిన్ అయ్యారు.  

తెలుగులో నిధి ఫస్ట్ సినిమా 'సవ్యసాచి'. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత 'హీరో' చేశారు.

అందాల నిధి హైదరాబాద్‌లో జన్మించిందని తెలుసా? ఆవిడ అమ్మమ్మది బేగం బజార్‌లోని మార్వాడి ఫ్యామిలీ.

తండ్రి ఉద్యోగరీత్యా బెంగళూరులో పెరిగింది. కొన్నాళ్ళు వెస్ట్ బెంగాల్‌లో కూడా నిధి ఫ్యామిలీ ఉంది.

నిధి అగర్వాల్ మాతృభాష హిందీ. అయితే ఆవిడ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ కూడా మాట్లాడుతుంది.

బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్‌లో నిధి అగర్వాల్ డిగ్రీ చేశారు.

కథక్, ఇటాలియన్ బాలే డ్యాన్స్ లో నిధి చిన్నప్పటి నుంచి శిక్షణ పొందారు. ఆవిడ ట్రైన్డ్ డ్యాన్సర్.

నిధి అగర్వాల్ ఆగస్టు 18న జన్మించారు. ఆవిడ 90స్ కిడ్. ఇయర్ ఆఫ్ బర్త్ 1993లో.

'మిస్ దివా యూనివర్స్ 2014'లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చారు నిధి అగర్వాల్.