Telangana Rising Summit: పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
CM Revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రజలకూ దగ్గర చేస్తోంది ప్రభుత్వం. ఇన్వెస్టర్లతో ఒప్పందాల తర్వాత మూడు రోజుల పాటు పబ్లిక్ ఉత్సంగా నిర్వహిస్తున్నారు.

Rising Summit For common people: తెలంగాణ ప్రభుత్వం భారత ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ ఆర్థిక సదస్సు, ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఐటీ జెయింట్స్‌ను ఆహ్వానించారు. మొత్తం 1,300 మంది ప్రముఖ అతిథులు, 500కి పైగా గ్లోబల్ కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. అయితే, సదస్సు ముగిసిన తర్వాత డిసెంబర్ 10 నుంచి 13 వరకు పబ్లిక్‌కు అందుబాటులోకి రావడంతో, ఇది కేవలం బిజినెస్ ఈవెంట్ కాకుండా ప్రజల ఉత్సవంగా మారుతోంది.
ముచెర్ల సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో భారత ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సమ్మిట్ CII, FICCI, NASSCOM, CREDAI వంటి ప్రముఖ సంఘాలు, EY, Deloitte, PwC వంటి కన్సల్టింగ్ ఫర్మ్‌లు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అజయ్ దేవ్‌గణ్, సల్మాన్ ఖాన్ , స్పోర్ట్స్ పర్సనాలిటీలు పాల్గొంటారు. సమ్మిట్‌లో మూడు ట్రిలియన్ ఎకానమీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, స్పెషల్ ప్లానింగ్, నెట్ జీరో తెలంగాణ వంటి థీమ్‌లపై చర్చలు జరుగనున్నాయి. 20కి పైగా ప్రాజెక్టులు, ముఖ్యంగా 30,000 ఎకరాల భారత ఫ్యూచర్ సిటీ, మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ను ప్రదర్శిస్తారు.
సదస్సు ముందుగానే మెగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆకర్షిస్తోంది. స్పోర్ట్స్ సిటీ, టూరిజం డెవలప్‌మెంట్, HMDA ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు MoUలు సంతకాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. 70 థీమాటిక్ స్టాల్స్‌లో ఆడియో-విజువల్ ప్రెజెంటేషన్లు, గ్రాఫిక్స్, యానిమేటెడ్ కంటెంట్‌తో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తారు. డిసెంబర్ 9న గ్రాండ్ డ్రోన్ షో, 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047'తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టార్గెట్ చేస్తున్నారు. అతిథులకు తెలంగాణ సాంస్కృతిక బలం చూపించే బహుమతులు ఇస్తున్నారు.
Presenting the official schedule for the Telangana Rising Global Summit, to be held on December 8-9.
— Telangana Rising 2047 (@TGRising2047) December 6, 2025
This is the blueprint of what the next two decades will look like.
Explore the complete schedule below.#TelanganaRising2047 #TelanganaRisingGlobalSummit pic.twitter.com/5XnG7g8yWS
సమ్మిట్ మొదలుపెట్టినప్పుడు ఇన్వెస్టర్ల సమావేశంగా ప్రకటించినా ఇప్పుడు పబ్లిక్ ఈవెంట్‌గా మారుస్తున్నారు. ఉచిత బస్సులతో MGBS, JBS, కుకట్‌పల్లి, చార్మినార్, LB నగర్ నుంచి ప్రజల్ని తీసుకెళ్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు, ఫైర్‌వర్క్స్, ఫుడ్ కోర్ట్స్, కార్నివల్ వంటివి ఏర్పాటుచేశారు. రైజింగ్ సమ్మిట్ సామాన్యులకు పట్టని పెద్దోళ్ల వ్యవహారం కాకుండా, ప్రజలకు దగ్గర చేయాలి అనే తన విజన్ ప్రకారం ఈవెంట్‌ను రేవంత్ డిజైన్ చేశారు. ఐఎస్‌బీ, నీతి ఆయోగ్ నిపుణుల సలహాలతో సిద్ధం చేసిన 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను సమ్మిట్‌లో ఆవిష్కరిస్తారు.
సమ్మిట్ రెండు రోజులు అతిథులు, అధికారులకు మాత్రమే, తర్వాత మూడు రోజులు పబ్లిక్‌కు ఓపెన్. ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు రైజింగ్ సమ్మిట్ వద్ద కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలు రాష్ట్ర భవిష్యత్ ప్రాజెక్టులు చూడవచ్చు, అధికారులతో మాట్లాడవచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్‌లు ఆస్వాదించవచ్చు. బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణను ప్రమోట్ చేస్తూ, మెగా ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురావడమే లక్ష్యం అని సీఎం రేవంత్ చెబుతున్నారు. తెలంగాణ భవిష్యత్తును అనుభవించాలంటే, డిసెంబర్ 8-13 మధ్య ఫ్యూచర్ సిటీలో తప్పక ఉండాలని ప్రభుత్వం ప్రజలకు పిలుపునిస్తోంది.





















