Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగారు. టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఒక సెంచరీతో కోహ్లీ ఎన్నో రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ తోపాటు సీనియర్ ప్లేయర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది. “మనకు టీ పెట్టడం ఎంత సులభమో, కోహ్లీకి పరుగులు చేయడం అంతే సులభం” అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేసాడు. దాంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్ అయింది. మాజీ ప్లేయర్స్ నుంచి విరాట్ కోహ్లీ లాంటి సీనియర్స్ ప్లేయర్స్ కు వస్తున్న సపోర్ట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే బౌలర్ యుజువేంద్ర చాహల్ చేసిన ట్వీట్ కూడా బాగా వైరల్ అవుతుంది. కేవలం నా కన్నా 52 సెంచరీలు ఎక్కువ అంటూ ట్వీట్ చేసాడు చాహల్. విరాట్ చేసిన ఈ ఒక సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఆడిన కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు చేసాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.





















