Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సామర్థ్యంపై విశ్లేషకులు విరుచుకుపడుతున్నారు. 2009 నుండి కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్, ఇప్పటివరకు సాధించిన ఐదు ఐపీఎల్ టైటిళ్లు కేవలం ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ వల్లే సాధ్యమయ్యాయని అభిప్రాయపడుతున్నారు.
ధోనీ కెప్టెన్సీ లేని చోట ఫ్లెమింగ్ ఎప్పుడూ విజయం సాధించలేదని చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సీజన్‌లో కేవలం కోచ్ మాత్రమే కాదు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రుతురాజ్ కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు.
సీజన్ ప్రారంభంలోనే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నైకి రాబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లోనైనా చెన్నై మళ్ళీ పుంజుకుంటుందో లేదో చూడాలి. ఫ్లెమింగ్ తన వ్యూహాలను మార్చుకుని జట్టును గెలుపు బాట పట్టిస్తారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ టీమ్, ఐదుసార్లు చాంపియన్ చెన్నై మళ్ళీ పాత వైభవాన్ని చాటుకోవాలని కోరుకుంటున్నారు.























