అన్వేషించండి

3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !

State Votes: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరి, అసోం, కేరళల్లో పోలింగ్ ముగిసింది. భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Massive polling recorded in Assam, Kerala and Puducherry : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  మూడు ముఖ్యమైన రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కేరళ, అసోం ,  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపరిచారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన అధికారిక గణాంకాలను బట్టి చూస్తే, ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్లు స్పష్టమవుతోంది.
  
కేరళ: హోరాహోరీ పోరులో  భారీ  ఓటింగ్

కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఎల్డీఎఫ్ (LDF) , యూడీఎఫ్ (UDF) మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ రాష్ట్రంలో ఓటర్లు ఎప్పటిలాగే చైతన్యాన్ని చాటారు. సాయంత్రం 5 గంటల సమయానికి కేరళలో సుమారు 75శాతానికిపైగా  పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు క్యూలైన్లలో అధిక సంఖ్యలో కనిపించారు. క్యూలో ఉన్న వారందరికీ ఓటు  వేసే అవకాశం లభిస్తుంది. అందుకే పోలింగ్ శాతం ఎనభై శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి .కేరళలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.   

 
అసోంలో రికార్డు స్థాయి పోలింగ్ 

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఒకే విడతలో  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  84.42% భారీ ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన  తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన కుటుంబంతో కలిసి జలుక్‌బరీలో ఓటు వేయగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ జోర్హాట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు, ఒకచోట పోలింగ్ కేంద్రం లోపల వీడియో తీసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు కావడం వంటి చిన్న చిన్న సంఘటనలు మినహా, 31,490 కేంద్రాల్లో పోలింగ్ సజావుగా సాగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హ్యాట్రిక్ విజయం కోసం చూస్తుండగా, పదేళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి గట్టిగా పోరాడుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.  

పుదుచ్చేరిలోనూ ఓటెత్తిన జనం
  
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు  ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  82.35%   భారీ ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు, ముఖ్యంగా మహిళా ఓటర్లు , యువత అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి , కాంగ్రెస్-డీఎంకే కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ ఎన్నికలలో, అక్కడక్కడా ఈవీఎంల సాంకేతిక సమస్యలు మినహా పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా సాగింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు వేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.    turnout records Puducherry leads with 86.92 per cent, followed closely by Assam at 84.42 per cent, and Kerala at 75.01 per cent.#Assemblypolls

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Udhayanidhi Arrest: తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు! త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై కేసులు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు! త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై కేసులు
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget