అన్వేషించండి

High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట

Uric Acid : ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం అనే సమస్య చాలా సాధారణమైపోయింది. దీనిని అదుపులో ఉంచుకోకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్ ఎలా కంట్రోల్ చేయాలంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నిరంతర నొప్పులుంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం అవశ్యం.

High Uric Acid Can Affect Your Health : శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ఈరోజుల్లో ప్రధాన సమస్యగా మారిపోయింది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు.. శరీరంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. దానిని మూత్రపిండాలు దానిని వడపోసినా.. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వేయించిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల దీని స్థాయిలను పెరిగిపోతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే వచ్చే సమస్యలు ఏంటో.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

యూరిక్ యాసిడ్ పెరిగితే వచ్చే నష్టాలు..

యూరిక్ యాసిడ్ రక్తంలో ఎక్కువగా పేరుకుపోతే హైపర్‌యూరిసీమియా అంటారు. ఇది పెరిగితే వెంటనే లక్షణాలు తెలియకపోవచ్చు. కానీ ఎక్కువకాలం కొనసాగితే కొన్ని సమస్యలకు దారితీయొచ్చని చెప్తున్నారు నిపుణులు. కీళ్ల నొప్పులు, వాపు, ఎర్రబడటం, కీళ్లలో తీవ్రమైన నొప్పి రావడం, రాత్రివేళ నొప్పి ఎక్కువ కావడం వంటివి కనిపిస్తాయి. అధిక యూరిక్ యాసిడ్ కొందరిలో కిడ్నీ స్టోన్స్‌ ఏర్పరుస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించవచ్చు. రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటు, టైప్-2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులతో కలిసి కనిపిస్తుంది.

Also Read : తేనెలో వెల్లుల్లి ముంచి ఉదయాన్నే తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు

యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలు

రెడి మీట్, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవ మాంసాలు, సముద్రపు ఆహారాల తీసుకుంటే ప్యూరిన్లు పెరుగుతాయి. ఇవి శరీరంలో విచ్ఛిన్నం కావడం వల్ల యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ ఆహారాలను అధికంగా తీసుకోకూడదు. అలాగే షుగర్ డ్రింక్స్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండే కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఆల్కహాల్, ముఖ్యంగా బీర్‌లో ప్యూరిన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగించే ప్రక్రియను నెమ్మదింపజేసి.. అది శరీరంలో పేరుకుపోయేలా చేస్తాయి. తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీంతో యూరిక్ యాసిడ్‌ను తొలగించడం కష్టమవుతుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. ఇది జీవక్రియను నెమ్మదింపజేసి.. శరీరం నుంచి విష పదార్థాలను సరిగ్గా తొలగించకుండా నిరోధిస్తుంది.

Also Read : యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఎక్కువైతే ఆరోగ్యానికి కలిగే నష్టాలివే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యూరిక్ యాసిడ్‌ను తగ్గించే సులభమైన మార్గాలు

రెడ్ మీట్, లివర్, మూత్రపిండాలు వంటి అవయవ మాంసాలు, సీ ఫుడ్ మానేసి.. లైట్ ఫుడ్,  పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినడం వల్ల శరీరం నుంచి యూరిక్ యాసిడ్ బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. దోసకాయ, బొప్పాయి, ఆపిల్ పండ్లు తీసుకుంటే మంచిది. స్వీట్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్ వీలైనంత వరకు కంట్రోల్ చేయండి. దానికి బదులుగా కొబ్బరి నీరు లేదా నిమ్మరసం వంటివి తాగవచ్చు. 

ఇవేకాకుండా ప్రతిరోజూ ఉదయం నడక లేదా యోగా వంటి మితమైన వ్యాయామం జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అంతేకాకుండా మద్యపానాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానుకోవడం యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో గణనీయంగా సహాయపడుతుంది.

Also Read : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

నిరంతర కీళ్ల నొప్పి, వాపు లేదా బిగుతు అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలకు సంకేతం కావచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించి.. వారి సలహా మేరకు చికిత్స తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలిని పాటించడం ద్వారా.. యూరిక్ యాసిడ్ స్థాయిలను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా కీళ్ల నొప్పి, గౌట్‌ను నివారించవచ్చు. 

ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని చిట్కాలు, టిప్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
Advertisement

వీడియోలు

IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget