ఏ వైపు పడుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుందో తెలుసా?

ఆసిడిటీ, గుండెల్లో మంట సమస్యలు ఉంటే ఎడమ వైపు పడుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

కుడి వైపు పడుకోవడం వల్ల కొందరిలో యాసిడ్ రిఫ్లక్స్ పెరగవచ్చు కాబట్టి తరచుగా ఎసిడిటీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.

భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. భోజనం చేసిన తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల తర్వాత నిద్రపోవడం మంచిదిగా పరిగణిస్తున్నారు.

అలాగే మంచి నిద్ర కోసం సరైన దిండు, సరైన భంగిమ అవసరం.

చాలా కాలంగా ఎసిడిటీ అజీర్ణం లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి.

సరైన నిద్ర భంగిమను అవలంబించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది గ్యాస్ అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పొట్టపై పడుకునే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే అది కడుపుపై ఒత్తిడిని పెంచుతుంది. జీర్ణక్రియ సమస్యలు తలెత్తవచ్చు.

ఏదైనా ప్రత్యేక సమస్య లేదా వైద్య పరిస్థితి ఉంటే అప్పుడు డాక్టర్ సలహా ప్రకారం నిద్రపోయే స్థానాన్ని ఎంచుకోవాలి.

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.