అన్వేషించండి

Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట

Flu vs Common Cold : ఫ్లూను సాధారణ జలుబుగా పొరబడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ప్రతి సంవత్సరం ఫ్లూ టీకా వేయించుకోవడం తీవ్రమైన ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చాలామంది ఫ్లూని సాధారణ జలుబుగా పొరబడుతున్నారు; అది తీవ్రమైనది.
  • మధుమేహం, ఆస్తమా రోగులకు ఫ్లూ ప్రాణాంతకం; నివారణే ఉత్తమం.
  • ఫ్లూ వైరస్ నిరంతరం మారుతుంది కాబట్టి, వార్షిక టీకా అవసరం.
  • టీకా తీవ్ర అనారోగ్యాన్ని తగ్గిస్తుంది; స్వల్ప లక్షణాలు అపోహలు.

Annual Flu Shot : చాలా మంది ఫ్లూ లేదా ఇన్ఫ్లుఎంజాను కేవలం కొన్ని రోజుల్లో దానంతట అదే తగ్గిపోయే ఒక సీజనల్ జ్వరం లేదా తేలికపాటి జలుబుగా భావిస్తారు. పలు రిపోర్ట్స్ ప్రకారం.. ప్రతి సంవత్సరం ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో వేలాది మంది ఫ్లూ బారిన పడుతున్నారు. అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే టీకా వేయించుకోవాలని ఆలోచిస్తున్నారు. పోలియో, మీజిల్స్, హెపటైటిస్ వంటి వ్యాధులకు టీకాలు సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ.. వార్షిక ఫ్లూ టీకా మాత్రం అత్యంత తక్కువగా ఉపయోగిస్తున్న వాటిలో ఒకటిగా మిగిలిపోయిందని.. దీనిపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు.

నిపుణులు మాత్రం ఫ్లూను తేలికగా తీసుకోవద్దని చెప్తున్నారు. ప్రతి ఏడాది ఫ్లూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి దీనిని ఎందుకు తేలికగా తీసుకోకూడదో, ప్రతి ఏడాది ఫ్లూ టీకా తీసుకోవడం ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : వర్షాల వల్ల జలుబు, దగ్గు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి కోసం వీటిని తినమంటోన్న వైద్యులు

ఫ్లూని లైట్ తీసుకోకండి..

ఫ్లూను సాధారణ జలుబుగా పొరబడటమే అతిపెద్ద అపోహ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్ కంటే ఫ్లూ పూర్తిగా భిన్నమైన వైరస్ వల్ల వస్తుందని.. అది చాలా తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు కొన్ని రోజుల్లోనే కోలుకుంటారు. కానీ ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

ఫ్లూ ప్రమాదం ఎవరికి ఎక్కువ?

మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, గుండె జబ్బులు, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందుకే దీనిని తేలికగా తీసుకోకపోవడం మంచిదని అంటున్నారు. అలాగే ఫ్లూ వచ్చినా మందులతో నయం అవుతుంది కాబట్టి టీకా ఎందుకు వేయించుకోవాలని విస్మరిస్తూ ఉంటారు. కానీ చికిత్స కన్నా నివారణే ఎప్పుడూ ఉత్తమమైనదని వైద్యులు చెబుతారు. 

ఫ్లూ అనేది టీకాతో నివారించగల వ్యాధి. టీకా వేయించుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, చివరికి మరణం సంభవించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని సూచిస్తున్నారు. లేదంటే ఈ వైరస్ న్యుమోనియాకు కూడా కారణం కావచ్చు. ముందు నుంచే ఉన్న ఆస్తమా లేదా గుండె జబ్బులను తీవ్రతరం చేసి, తరచుగా ఆసుపత్రిలో చేరడానికి దారితీయవచ్చు.

Also Read : డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా దగ్గు, జలుబు మందులు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!

వ్యాక్సిన్ వేయించుకుంటే ఫ్లూ వస్తుందా?

ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లనే ఫ్లూ వస్తుందనేది మరో ప్రధాన అపోహ ఉంది. వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. కొంతమందికి వ్యాక్సిన్ వేసిన చోట తేలికపాటి నొప్పి లేదా వాపు, స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు లేదా ఒకటి రెండు రోజుల పాటు అలసట వంటివి కలగవచ్చు. అయితే ఈ లక్షణాలు తాత్కాలికమైనవి. శరీరం రోగనిరోధక వ్యవస్థ వ్యాక్సిన్‌కు సరిగ్గా స్పందిస్తోందని సూచిస్తాయి. దీనిని ఒక అనారోగ్యంగా పరిగణించకూడదని క్లారిటీ ఇచ్చారు. 

ప్రతి ఏడాది వేయించుకోవాలా?

పోలియో లేదా తట్టు టీకాలా కాకుండా.. ఫ్లూ టీకా జీవితంలో ఒక్కసారి వేసుకునే పరిష్కారం కాదు. ఫ్లూ వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతుంది. ప్రతి సీజన్‌లో కొత్త రకాలు వ్యాపిస్తాయి. దీనివల్ల పాత టీకాల ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ప్రస్తుతం వ్యాపిస్తున్న రకానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కొత్త టీకా వేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, ఆరోగ్య కార్యకర్తలు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతి సంవత్సరం ఫ్లూ టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. 

Also Read : చలికాలంలో వచ్చే వ్యాధులు దూరం చేసే ఇంటి చిట్కాలు.. వీటితో జలుబు, దగ్గు, కీళ్లనొప్పులు దూరం

వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకుంటే మంచిది?

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు టీకాలు తీసుకోవడం మంచిది. లేదా వర్షాలు కురిసే సమయంలో కూడా ముందు జాగ్రత్తగా టీకా తీసుకోవాలి. దీనికోసం వైద్యులు క్వాడ్రివాలెంట్ ఫ్లూ వ్యాక్సిన్‌ను సిఫార్సు చేస్తారు. ఇది ఆ సీజన్‌లో ప్రబలంగా ఉండే అవకాశం ఉన్న నాలుగు వేర్వేరు వైరస్ రకాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

జలుబు, మరిన్ని సీజనల్ వ్యాధుల గురించిన హెల్త్ టిప్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget