అన్వేషించండి

Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం

KTR: జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కేటీఆర్‌కు స్వాగతం పలికారు.

KTR invited Jeevan Reddy in to BRS:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల పర్యటనలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డితో  తన నివాసంలో సమావేశం అయ్యారు.   కేటీఆర్ రావడంతో జగిత్యాల గులాబీ మయమైంది.  తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లా సరిహద్దుకు చేరుకున్న కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ, బాణాసంచా కాలుస్తూ పార్టీ కార్యకర్తలు తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. జై కేటీఆర్.. జై బీఆర్ఎస్  నినాదాలతో జగిత్యాల వీధులు హోరెత్తాయి.

ఈ పర్యటనలో అత్యంత కీలక ఘట్టం ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ కావడం. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి, ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్వయంగా కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.                              

జీవన్ రెడ్డి నివాసం వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దాదాపు గంటకు పైగా సాగిన వీరి భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీలో జీవన్ రెడ్డికి కల్పించబోయే ప్రాధాన్యతపై చర్చలు జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి బాగుందని తాజాగా వ్యాఖ్యానించడం ఆయన పార్టీ మార్పును దాదాపు ఖాయం చేసింది. ఏప్రిల్ 13న లేదా 27న  పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.                                        

క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదని కేటీఆర్  స్పష్టం చేశారు.  జగిత్యాలలో పార్టీకి ఉన్న పట్టును ఈ భారీ బైక్ ర్యాలీ నిరూపించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు పార్టీలోకి రావడం వల్ల మరింత ఉత్సాహం పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేటీఆర్  చెప్పారు.  మొత్తానికి కేటీఆర్ జగిత్యాల పర్యటన అటు కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు, ఇటు ప్రత్యర్థి పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జీవన్ రెడ్డి వంటి మేధావి, సీనియర్ నేత బీఆర్ఎస్ గూటికి చేరితే, అది జిల్లా రాజకీయాల్లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద మార్పుకు దారితీస్తుందని  భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget