అన్వేషించండి

IPL 2026 CSK Failures: ధోనీ లేకపోతే ఫ్లెమింగ్ సున్నా! సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు.. రుతురాజ్ కెప్టెన్సీపైనా..!

సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ విజయాలన్నీ ఎంఎస్ ధోనీ చలవేనని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి . ప్రస్తుత దూకుడుగా సాగే క్రికెట్‌కు ఫ్లెమింగ్ సెట్ కావడం లేదని అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

IPL 2026 MS Dhoni VS Stephen Flemings: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సామర్థ్యంపై విశ్లేష‌కులు విరుచుకుప‌డుతున్నారు. 2009 నుండి కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్, ఇప్పటివరకు సాధించిన ఐదు ఐపీఎల్ టైటిళ్లు కేవలం ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ వల్లే సాధ్యమయ్యాయని అభిప్రాయ‌పడుతున్నారు. ధోనీ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే తన ఉనికిని కోల్పోతున్నట్లు కనిపిస్తోందని గుర్తు చేస్తున్నారు.

ధోనీ తోడు లేకపోతే అంతేనా?
ధోనీ కెప్టెన్సీ లేని చోట ఫ్లెమింగ్ ఎప్పుడూ విజయం సాధించలేదని చాలా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ విష‌యంలో భార‌త మాజీ ఓపెన‌ర్ శ‌ఠ‌గోప‌న్ ర‌మేశ్ .. ఫ్లెమింగ్ వ్యూహాల‌పై పెద‌వి విరిచాడు. ఫ్లెమింగ్ సక్సెస్ పూర్తిగా ధోనీపైనే ఆధారపడి ఉందని మారుతున్న ఆధునిక క్రికెట్ వేగానికి తగ్గట్లుగా ఫ్లెమింగ్ తన మైండ్‌సెట్‌ను మార్చుకోలేకపోతున్నాడ‌ని విమ‌ర్శించాడు. ప్రస్తుత అగ్రెసివ్ గేమ్‌లో ఆయన పాతకాలపు ఆలోచనలతో ఐదు అడుగులు వెనకబడి ఉన్నాడ‌ని, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను ఎలాగైతే విశ్లేషిస్తారో, కోచ్‌ల పనితీరును కూడా అలాగే పరీక్షించాల్సిన సమయం వచ్చిందని రమేష్ పేర్కొన్నాడు. రుతురాజ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జట్టు సరైన దిశలో సాగడం లేదని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

రుతురాజ్ ఫామ్ - కెప్టెన్సీ సవాళ్లు..
ఈ సీజన్‌లో కేవలం కోచ్ మాత్రమే కాదు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రుతురాజ్ కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై ర‌మేశ్ స్పందిస్తూ.. ఫోర్లు, సిక్సర్లు బాదడానికి అనుభవం అక్కర్లేదు కానీ, బౌండరీలను ఆపడానికి అనుభవం కావాలని విశ్లేషించాడు. ప్రస్తుతం సీఎస్కే బౌలింగ్ విభాగంలో ఆ అనుభవం లోపించిందని, రుతురాజ్ తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా బ్యాట్‌తో పరుగులు సాధించాలని సూచించాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తేనే నాయకుడిగా ఆయనకు గుర్తింపు, ఆత్మవిశ్వాసం లభిస్తాయని రమేష్ పేర్కొన్నాడు.

ఢిల్లీతో కీలక పోరు..
సీజన్ ప్రారంభంలోనే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నైకి రాబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం. ఈ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లోనైనా చెన్నై మళ్ళీ పుంజుకుంటుందో లేదో చూడాలి. ఫ్లెమింగ్ తన వ్యూహాలను మార్చుకుని జట్టును గెలుపు బాట పట్టిస్తారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ టీమ్, ఐదుసార్లు చాంపియ‌న్ చెన్నై మళ్ళీ పాత వైభవాన్ని చాటుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఐపీఎల్ సన్నాహక శిభిరానికి ముందుగానే చేరుకున్న ధోనీ.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు గాయపడ్డాడు. అతను ప్రస్తుతం రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. త్వరలోనే చెన్నై జట్టులో చేరనున్నట్లు సమాచారం. అతను టీమ్ లోకి వస్తే జట్టు తలరాత మారుతుందని అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఇక ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ లు ఓడిన చెన్నై పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli News: బౌల‌ర్ కోసం కోహ్లీని వద్దనుకున్న ఢిల్లీ - సెహ్వాగ్ రివీల్ చేసిన షాకింగ్ నిజాలు!
బౌల‌ర్ కోసం కోహ్లీని వద్దనుకున్న ఢిల్లీ - సెహ్వాగ్ రివీల్ చేసిన షాకింగ్ నిజాలు!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్ జోరు.. నాలుగో విజ‌యంతో టాప్ ప్లేస్ కు కింగ్స్.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్, శ్రేయ‌స్.. ముంబైకీ నిరాశ‌
పంజాబ్ జోరు.. నాలుగో విజ‌యంతో టాప్ ప్లేస్ కు కింగ్స్.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్, శ్రేయ‌స్.. ముంబైకీ నిరాశ‌
SRH Injury Update: ఎస్ఆర్‌హెచ్‌కు మరో షాక్.. స్టార్ బౌలర్ అవుట్! కానీ కెప్టెన్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!
ఎస్ఆర్‌హెచ్‌కు మరో షాక్.. స్టార్ బౌలర్ అవుట్! కానీ కెప్టెన్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!
Khaleel Ahmed : సీఎస్కేకు బిగ్‌ షాక్! ఐపీఎల్‌ నుంచి ఖలీల్ అహ్మద్‌ అవుట్!
సీఎస్కేకు బిగ్‌ షాక్! ఐపీఎల్‌ నుంచి ఖలీల్ అహ్మద్‌ అవుట్!
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash : మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
Constitutional Amendment Bills: రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ లేని ఎన్డీఏ- బీజేపీ దగ్గర ప్లాన్ బీ ఉందా ?
రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ లేని ఎన్డీఏ- బీజేపీ దగ్గర ప్లాన్ బీ ఉందా ?
Donald Trump: త్వరలోనే అంతా ముగుస్తుందన్న డొనాల్డ్ ట్రంప్ - పాకిస్తాన్ వెళ్లానని ప్రకటన
త్వరలోనే అంతా ముగుస్తుందన్న డొనాల్డ్ ట్రంప్ - పాకిస్తాన్ వెళ్లానని ప్రకటన
Dindi - Chinchinada Bridge: నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్ జోరు.. నాలుగో విజ‌యంతో టాప్ ప్లేస్ కు కింగ్స్.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్, శ్రేయ‌స్.. ముంబైకీ నిరాశ‌
పంజాబ్ జోరు.. నాలుగో విజ‌యంతో టాప్ ప్లేస్ కు కింగ్స్.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్, శ్రేయ‌స్.. ముంబైకీ నిరాశ‌
SIP Power of Compounding : SIPని తక్కువ అంచనా వేయకండి.. ఈరోజు చిన్న మొత్తమే, రేపటికి పెద్ద లాభం
SIPని తక్కువ అంచనా వేయకండి.. ఈరోజు చిన్న మొత్తమే, రేపటికి పెద్ద లాభం
Heart Health in Summer : వేసవిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గించాలా? అయితే లైఫ్​స్టైల్​లో ఈ మార్పులు చేసేయండి
వేసవిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గించాలా? అయితే లైఫ్​స్టైల్​లో ఈ మార్పులు చేసేయండి
Manushi Chhillar: బికినీలో మానుషీ... వరుణ్ తేజ్ సినిమాలో నటించిందీ అమ్మాయి
బికినీలో మానుషీ... వరుణ్ తేజ్ సినిమాలో నటించిందీ అమ్మాయి
Embed widget