Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
Odela 2 OTT Rights Price: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన 'ఓదెల 2' ఏప్రిల్ 17న థియేటర్లలోకి రానుంది. అయితే... సినిమా బడ్జెట్ లో 20% థియేటర్స్ నుంచి వస్తే చాలట.

ఒక వైపు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఆయా సినిమాలకు ఓటీటీ రైట్స్ పెద్ద మొత్తంలో వస్తున్నాయి. మరొక వైపు కొన్ని సినిమాల ఓటీటీ డీల్స్ క్లోజ్ అవ్వక కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుని ఇండస్ట్రీ అంతటికీ షాక ఇచ్చింది తమన్నా 'ఓదెల 2' (Odela 2 Movie) టీం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఓదెల 2'!
Tamannaah Bhatia's Odela 2 OTT Rights Deal: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'ఓదెల 2'. ఇవాళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 17న థియేటర్లలోకి సినిమాను తీసుకు వస్తున్నట్లు తెలిపారు. సినిమా విడుదల తేదీ ఖరారు చేయడానికి, ఆ తేదీ వెల్లడించడానికి ముందే 'ఓదెల 2' టీం ఓటీటీ డీల్ క్లోజ్ చేసిందట.
Odela 2 movie ott platform: అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 'ఓదెల 2' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఆయా భాషలు అన్నిటిలోనూ తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకని ఫాన్సీ రేటుకు ఓటిటి రైట్స్ తీసుకున్నారట. ఆల్మోస్ట్ 12 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమాను తీసుకుందని తెలిసింది.
హిందీలో 'స్త్రీ 2' సక్సెస్ ఎఫెక్ట్... 6 కోట్లు!
Odela 2 Hindi theatrical rights price: తమన్నా హిందీ సినిమాలలో హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే ఆయా సినిమాలు బ్లాక్ బస్టర్లు కాలేదు. కానీ ఆవిడ స్పెషల్ సాంగ్ చేసిన శ్రద్ధ కపూర్ సినిమా 'స్త్రీ 2' భారీ వసూళ్లు సాధించింది. ఆ సినిమా విజయంలో తమన్నా పాట 'ఆజ్ కి రాత్' ఇంపాక్ట్ కూడా ఉంది. ఆ సక్సెస్ ఎఫెక్ట్ ఇప్పుడు 'ఓదెల 2' మీద కనిపించింది. సుమారు 6 కోట్ల రూపాయలకు హిందీ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ తీసుకున్నారట. ఆల్రెడీ శాటిలైట్ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలిసింది. మొత్తం మీద 20 నుంచి 22 కోట్ల రూపాయలు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా తమన్నా సినిమాకు వచ్చాయట. దాంతో నిర్మాతలు పెట్టిన ఖర్చులో కేవలం 20% థియేటర్లో నుంచి వస్తే సరిపోతుందని టాక్.
Also Read: ఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?
సంపత్ నంది క్రియేట్ చేసిన కథతో అశోక్ తేజ 'ఓదెల 2' చిత్రానికి దర్శకత్వం వహించారు. సూపర్ హిట్ 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్ ఇది. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా కూడా నటించారు. వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.





















