అన్వేషించండి

RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం

BSBD ఖాతాలకు ఉచిత సేవలను విస్తరించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India) నిర్ణయం తీసుకుని కస్టమర్లకు ఉపశమనం కలిగించింది.

Zero Balance Account: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సాధారణ కస్టమర్‌లకు ఉపశమనం కలిగిస్తూ, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలో భారీ మార్పులు చేసింది. ఆర్బీఐ మార్పులలో ప్రతి నెలా ఎలాంటి పరిమితి లేకుండా డిపాజిట్లు, రెన్యువల్ ఛార్జీలు లేకుండా ఉచిత ATM లేదా డెబిట్ కార్డ్ వినియోగం, ప్రతి సంవత్సరం కనీసం 25 పేజీల ఉచిత చెక్‌బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking), మొబైల్ బ్యాంకింగ్, పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ లాంటి నిర్ణయాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్‌లకు 7 రోజుల గడువు ఇచ్చింది. అప్పటిలోగా బ్యాంకులు BSBDలో మార్పులు చేయాలి.

ఉచిత విత్‌డ్రా లిమిట్ ఇప్పుడు ఎంత ?

బ్యాంకులు ప్రతి నెలా కనీసం 4 ఉచిత విత్‌డ్రాయల్‌లను అనుమతించాలి. ఇందులో వారి సొంత బ్యాంకు ATMలు, ఇతర బ్యాంకుల ATMల లావాదేవీలు ఉంటాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం, UPI, IMPS, NEFTతో పాటు RTGS వంటి డిజిటల్ చెల్లింపు లావాదేవీలను విత్‌డ్రాయల్‌గా పరిగణించరు. అంటే వినియోగదారుల నుండి ఈ డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జ్ చేయరు. 

ప్రస్తుత BSBD ఖాతా హోల్డర్లు కొత్తగా ప్రారంభించిన ఫీచర్లు, సౌకర్యాలను కోరవచ్చు. అయితే రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా హోల్డర్లు తమ ఖాతాను BSBD ఖాతాగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే వారికి ఇప్పటికే మరే ఇతర బ్యాంకులో ఖాతా ఉండకూడదు.

ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే బ్యాంకులు వీటిని ముందే కూడా అమలు చేసే అవకాశాలున్నాయి. RBI తన రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ డైరెక్షన్స్, 2025ని అప్‌డేట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనివల్ల బ్యాంకులు అందించే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాల ఫ్రేమ్‌వర్క్ అధికారికంగా మారుతుంది.

ఆర్బీఐ కీలక నిర్ణయాలు

  • నెలలో కనీసం 4 సార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
  • కార్డ్ స్వైప్ (PoS), NEFT, RTGS, UPIతో పాటు IMPS వంటి డిజిటల్ చెల్లింపులు 4 సార్లు లిమిట్ కింద లెక్కించరు.
  • సంవత్సరానికి కనీసం 25 పేజీల చెక్ బుక్, ఉచిత ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ కూడా లభిస్తుంది.
  • ఎలాంటి వార్షిక రుసుము (Annual Charges) లేకుండానే బ్యాంకులు ఖాతాదారులకు ATM, డెబిట్ కార్డ్ ఇవ్వనున్నాయి.

మార్పుల లక్ష్యం ఏమిటి?

భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ఈ మార్పులను అమలు చేయడానికి ఉద్దేశ్యం ఏమిటంటే BSBD (సేవింగ్స్ అకౌంట్) ఖాతాలకు ప్రజలకు మరింత చేరువ చేయడం. తద్వారా ప్రజలు దాని ప్రయోజనాలు అర్థం చేసుకుంటారు. ఈ కొత్త నిబంధనలు లోకల్ ఏరియా బ్యాంక్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేమెంట్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు వర్తిస్తాయని ఆర్బీఐ అధికారులు తెలిపారు.

Also Read: RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Jio Platforms IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ పునాదులపై భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
JPL IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ టెక్నాలజీతో భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Reliance Foundation Outreach: రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget