అన్వేషించండి

ITR Filing Mandatory: అధిక ఆదాయం లేకపోయినా వీళ్లు ITR ఫైల్ చేయాలి.. లేకపోతే ప్రభుత్వం నుంచి నోటీసులు తప్పవు

Income Tax Returns | మీ ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో ITR దాఖలు చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల్లో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనుంది.

IT Returns 2025 | ఆదాయపు పన్ను శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ (IT Return)లను దాఖలు చేయడానికి చివరి తేదీని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువులో కేవలం ఒక్క వారం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 7 వరకు దాఖలైన రిటర్న్‌లు ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి. సాధారణంగా వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు (Annual Income Tax) పరిమితి కంటే తక్కువగా ఉంటే ITR దాఖలు చేయాల్సిన అవసరం లేదని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి మీ పన్ను విధించదగిన ఆదాయం సున్నా అయినప్పటికీ, కొన్ని పరిస్థితులలో ITR ఫైల్ చేయడం తప్పనిసరి. అలా చేయకపోతే, జరిమానా విధించడమే కాకుండా, ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు కూడా పంపవచ్చు. 

కరెంట్ అకౌంట్లో కోటికి పైగా డిపాజిట్ చేస్తే 

మీరు ఏదైనా బ్యాంకు కరెంట్ అకౌంట్లో ఒక సంవత్సరంలో ఒక కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే కనుక ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్ నగదు, డిజిటల్ లావాదేవీలకు వర్తిస్తుంది. నల్లధనాన్ని (Black Money)ని అరికట్టేందుకు ఇలాంటి పెద్ద లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 

విదేశీ ప్రయాణాలకు 2 లక్షలకు పైగా ఖర్చు 

ఒకవేళ మీరు ఒక ఏడాదిలో చేసే విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీరు రిటర్న్ దాఖలు (ITR) చేయడం తప్పనిసరి. ఈ ఖర్చు వ్యక్తిగత యాత్రలు అయినా లేదా వ్యాపార యాత్ర అయినా ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది.  

విద్యుత్ బిల్లు 1 లక్షకు పైగా ఉంటే 

ఏడాదిలో మీ కరెంట్ బిల్లు 1 లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉంటే, మీ ఖర్చు, ఆదాయం మధ్య అంతరాన్ని ట్రాక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ITR ఫైల్ చేయాలి. తక్కువ సంపాదిస్తున్నప్పటికీ ఎక్కువ ఖర్చు చేసే వారిని ఈ రూల్ కవర్ చేస్తుంది. 

TDS కట్ చేసినప్పుడు ITR అవసరం 

ఒకవేళ మీ ఆదాయంపై సంవత్సరంలో రూ.25 వేలు లేదా అంతకంటే ఎక్కువ TDS కట్ అయితే మీరు కచ్చితంగా ITR ఫైల్ చేయాలి. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ.50 వేలుగా నిర్ణయించారు. పన్ను కడుతున్న వారు తమ ఆదాయాన్ని సరిగ్గా చూపించేలా చేయడమే దీని లక్ష్యం. 

విదేశీ ఆస్తులు లేదా బ్యాంకు ఖాతాలుంటే.. 

మీకు విదేశాల్లో ఏదైనా ఆస్తి ఉన్నా, మీరు విదేశీ బ్యాంకు ఖాతాలో సంతకం చేసే అధికారం కలిగి ఉంటే తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి. ITR దాఖలు చేసే సమయంలో మీరు మీ విదేశీ ఆదాయం, ఆస్తుల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఈ నియమాలను ప్రకటించిన ఆదాయం తక్కువగా ఉన్న వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచడానికి రూపొందించారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget