IPL 2025 SRH VS RR Updates: ఫేవరెట్ గా సన్ రైజర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూరమవడంతో బలహీనంగా రాయల్స్.. మ్యాచ్ కు వర్షం ముప్పు!!
SRH VS RR: సంజూ కెప్టెన్సీ సేవలు దూరమైన వేళ, రియాన్ పరాగ్ నాయకత్వంలో రాయల్స్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది. గత సీజన్ లో క్వాలిఫయర్-2లో రాయల్స్ ను ఓడించి, సన్ ఫైనల్లో ప్రవేశించింది.

IPL 2025 Favourite SRH VS RR: ఐపీఎల్ 2025లో ఆదివారం రెండు ఆసక్తికర మ్యాచ్ లు జరుగనున్నాయి. డబుల్ హెడర్ అని పిలిచే ఈ మ్యాచ్ ల్లో తొలి దాంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మరో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ చెన్నై వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో అందరి దృష్టి ఎక్కువగా సన్ రైజర్స్ మ్యాచ్ పైనే ఉంది.
గత సీజన్ లో ఫియర్లెస్ బ్యాటింగ్ తో సన్.. దుమ్ము రేపడం, ఈ సారి జట్టు మరింత బలంగా మారడంతో ఈ మ్యాచ్ పై అందరి ఫోకస్ నెలకొంది. సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్ లో గెలుపొందాలని సన్ తహతహలాడుతోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తున్న సన్.. ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక తొలి మూడు మ్యాచ్ లకు సంజూ శాంసన్ కెప్టెన్సీ సేవలు దూరమైన వేళ, రియాన్ పరాగ్ నాయకత్వంలో రాయల్స్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది. గత సీజన్ లో క్వాలిఫయర్-2లో రాయల్స్ ను ఓడించి, సన్ ఫైనల్లో ప్రవేశించింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రాయల్స్ భావిస్తోంది.
భీకరంగా ఆరెంజ్ ఆర్మీ ..
గత సీజన్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన ఎస్ఆర్ హెచ్ ఈ ఏడాది తన టీమ్ ను మరింత పటిష్టం పరుచుకుంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ రాకతో మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారింది. అలాగే బౌలింగ్ కూడా రాటుదేలింది. వెటరన్ మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, జయదేవ్ ఉనాద్కట్ తదితర బౌలర్లను తీసుకుని మరింత పటిష్టంగా మారింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పరుగుల సునామీ కురిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జంట ఫియర్లెస్ బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలని కోరుకుంటున్నారు. గతేడాది వీళ్లిద్దరి బ్యాటింగ్ తో చాలాసార్లు జట్టు 250 పరుగులను అలవోకగా సాధించింది. ఈసారి వీరి జోరు కొనసాగించాలని ఆశిస్తున్నారు. వన్ డౌన్ లో ఇషాన్ కిషాన్, తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ లాంటి ప్లేయర్లతో పటిస్టంగా ఉంది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఆల్ రౌౌండర్ గా బరిలోకి దిగగలడు. బౌలర్లలో మహ్మద్ షమీ, హర్షల్, చాహర్, జంపాలతో పటిష్టంగా ఉంది. రాయల్స్ తో జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాలి.
కష్టాల్లో రాయల్స్..
రాజస్థాన్ ఎక్కువగా రెగ్యులర్ కెప్టెన్ సంజూ పై ఆధారపడుతుంది. అతను చేతి వేలి గాయంతో తొలి మూడు మ్యాచ్ లకు కెప్టెన్సీకి దూరంగా ఉన్నాడు. కేవలం స్పెషలిస్టు బ్యాటర్ గానే బరిలోకి దిగుతాడు. ఇక ఓపెనర్లుగా సంజూ, యశస్వి జైస్వాల్ ఆడతారు. వన్ డౌన్ లో నితీశ్ రాణా ఆడుతుండగా, మిడిలార్డర్లో పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హిట్ మెయర్ బరిలోకి దిగుతారు. బౌలర్లుగా వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే బరిలోకి దిగే అవకాశముంది.
హసరంగాకు బ్యాటింగ్ కూడా రావడంతో తనను ఆల్ రౌండర్ గా పరిగణించవచ్చు. అయితే ఫుల్ బ్యాటింగ్ పవర్ తో ఉన్న సన్ ను రాయల్స్ నిలువరించడం బట్టే వారి గెలుపు ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంది. ఆల్రెడీ శుక్రవారం నుంచే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉండటంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు ఏర్పడుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

