అన్వేషించండి
Kavya Maran : వణుకు పుట్టించారు- కాలర్ ఎగరేసుకుని తిరగండి- టీం సభ్యులతో కావ్యా మారన్ కామెంట్స్
SRH Owner Kavya Maran : కోల్‌కతాతో ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ టీంతో మాట్లాడిన ఓనర్ కావ్య ఉపదేశం చేశారు. టీంను ఫైనల్ వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కర్నీ అభినందించారు.

వణుకు పుట్టించారు- కాలర్ ఎగరేసుకుని తిరగండి- టీం సభ్యులతో కావ్యా మారన్ కామెంట్స్ (Image Source:-SRH Twitter))
1/9

ఐపీఎల్ ఫైనల్లో కోల్ కతా చేతిలో ఓడిపోయాక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ తన టీమ్ తో మాట్లాడారు.
2/9

కోచ్ డానియెల్ వెట్టోరీ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హెడ్ సహా టీమ్ ప్లేయర్లంతా డ్రెస్సింగ్ రూమ్ లో ఉండగా వచ్చిన కావ్యా...ప్రతీ ప్లేయర్ ను అభినందించారు.
3/9

ఒక్క ఓటమో, గెలుపో ఈ ఏడాది సన్ రైజర్స్ ఆటను డిఫైన్ చేయలేదన్న కావ్యా... గతేడాది పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో ఉన్నా మన కోసం మన ఆటను సపోర్ట్ చేయటం కోసం వచ్చిన ఫ్యాన్స్ అందరినీ సన్ రైజర్స్ ప్లేయర్లు గర్వపడేలా చేశారన్నారు.
4/9

ఫైనల్లో ఓడిపోయామని ఐపీఎల్ కప్ పోయిందని బాధపడాల్సిన అవసరం లేదన్న సన్‌రైజర్స్ ఓనర్... ప్లేయర్లు ఇలా డల్‌గా ఉంటే తను చూడలేనన్నారు.
5/9

మిగిలిన మ్యాచుల్లానే దీన్ని ఒక మ్యాచుగా చూడాలని ఓటమిని మర్చిపోయి మళ్లీ వచ్చే ఏడాది ఇంకా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు.
6/9

కావ్యా మారన్ స్పీచ్ కు సన్ రైజర్స్ టీమ్ అంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు. వాస్తవానికి మ్యాచ్ కోల్పోయాక ఆటగాళ్లే కంటే కావ్యా మారనే ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు.
7/9

స్టేడియంలో అందరూ చూస్తుండగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలోనే కోలుకుని అందరినీ అప్రిషియేట్ చేశారు.
8/9

ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కావ్యా టీమ్ కి చెప్పిన మాటలను సన్ రైజర్స్ వీడియో రూపంలో పోస్ట్ చేసింది.
9/9

ట్రావియెస్ హెడ్ కావ్యా మారన్ వీడియోను రీ షేర్ చేయటంతో పాటు కావ్యా మారన్ ది బెస్ట్ ఓనర్ అంటూ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.
Published at : 28 May 2024 12:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion