Money Management Skills : నెలకు లక్షన్నర జీతం వస్తోన్నా కానీ సరిపోవట్లేదట.. ఐటీ ఉద్యోగి ఆవేదన, ప్లానింగ్ లేకుంటే అంతే మరి
Budget Plan : డబ్బు ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు.. దానిని ఎలా ఖర్చు పెడుతున్నామో కచ్చితంగా క్లారిటీ ఉండాలి. అది లేకుంటే మీరు వేలల్లో కాదు.. లక్షల్లో సంపాదించినా హ్యాపీగా ఉండలేరు.

Money Management Skills : పదివేలు సంపాదించినప్పుడే ప్రశాంతంగా ఉన్నానురా.. లక్షల్లో సంపాదిస్తున్నా డబ్బు సరిపోవట్లేదు. దీనికి అసలైన కారణమేంటో తెలుసా? సరైన ప్లానింగ్ లేకపోవడమే. లక్షల్లో శాలరీ వస్తోన్న మీకు డబ్బు సరిపోవట్లేదంటే కచ్చితంగా అది మీ బడ్జెట్ ప్లానింగ్‌లోని లోపమే. అదే లేకుంటే మీరు ఎంత సంపాదించినా సంతోషంగా ఉండలేరు. సరైన బడ్జెట్ ప్లానింగ్ ఉంటే తక్కువ శాలరీ వచ్చినా హ్యాపీగా, ప్రశాంతంగా ఉండగలరు.
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి onepoint5zero పేరుతో ఇన్‌స్టాలో "నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. కానీ అవి తనకి సరిపోవట్లేదంటూ రాసుకొచ్చాడు. చిన్నప్పటినుంచి ఈ మొత్తంలో సంపాదించడం నా డ్రీమ్ కానీ.. ఇప్పుడు నాకు 26 ఏళ్లు. నేను ఇంత మొత్తంలో సంపాదిస్తున్నా సరే.. ఆర్థిక భద్రతపై ఆందోళనతోనే ఉన్నానంటూ సోషల్ మీడియాలో తన బాధను పోస్ట్ రూపంలో షేర్ చేశాడు.
నెలకు 1.5 లక్షలు సంపాదిస్తాను. నా ఫ్యామిలీ నా సొంతూరులో ఉంటుంది. వారిని చూసుకోవడానికి, EMI కట్టుకోవడానికి, 30 నుంచి 40 వేలు మాత్రమే మిగులుతుంది. ఇది మంచి ఆదాయమే అయినప్పటికీ.. తను పెళ్లి చేసుకుంటే బెంగళూరులో అద్దెకు తీసుకున్నా.. ఇళ్లు కొనాలనుకున్నా.. ఫుడ్, ఇతర ఖర్చులకు ఈ డబ్బులు ఏమాత్రం సరిపోవంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకవేళ తన ఉద్యోగం సడెన్‌గా పోతే పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదని" పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ప్లానింగ్ లేకుంటే అంతే మరి..
డ్రీమ్ జాబ్ చేస్తూ ఎక్కువ మొత్తంలో సంపాదించినా.. తక్కువ శాలరీతో లైఫ్‌ని లీడ్ చేస్తున్న సరైన బడ్జెట్ లేకుంటే అంతే మరి. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే.. జాబ్ రాగానే ఎక్కడలేని EMIలు తలపై పెట్టుకుంటారు. ఎదుటివారి మెప్పు కోసం ట్రై చేస్తారు. అవసరానికి కాకుండా ఆడంబరాలకు బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుని.. EMIలు కట్టేందుకు కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడే ఇలాంటి ఆందోళనలు మొదలవుతాయి.
లగ్జరీగా ఉండాలనుకుంటే..
డబ్బులు ఎక్కువ సంపాదించినప్పుడు ఎంజాయ్ చేయాలని ఉంటుంది. పైగా చుట్టూ ఉండేవారు ఇంత సంపాదిస్తున్నా ఏమి ఖర్చు పెట్టట్లేదని జడ్జ్ చేస్తారేమో అనే భయం ఉంటుంది. అలాంటప్పుడు లగ్జరీగా ఉండాలనుకోవడం తప్పేమి కాదు. కానీ ఆర్థికంగా మీరు ఎంతవరకు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎంతవరకు ఖర్చు చేసుకుంటే మీపై ప్రెజర్ ఉండదు.. సేవింగ్స్ ఎలా సేవ్ చేస్తున్నారనే విషయాలను పరిగణలోకి తీసుకుని.. అవసరాలకు అనుగుణంంగా లగ్జరీ వస్తువులు కొనగోలు చేసుకోవాలి. వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేసేద్దామనుకుంటే కష్టమే మరి.
50-30-20 రూల్..
మీకు ఎంత శాలరీ వచ్చినా.. 50/30/20 రూల్‌ని ఫాలో అవుతూ బడ్జెట్‌ని డివైడ్ చేస్తే.. ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అద్దె, క్రెడిట్ కార్డ్స్, లోన్స్ వంటి అన్నీ ఖర్చులకు మీకు వచ్చే శాలరీలో 50 శాతాన్ని ఖర్చు చేయాలి. సినిమాలు, ట్రిప్స్, కార్లు, ఫోన్ వంటి వాటికి 30 శాతం ఖర్చు చేసుకోవాలి. మిగిలిన 20 శాతం కచ్చితంగా సేవింగ్స్ వైపు మళ్లించాలి. ఈఎంఐ లాంటివి లేకున్నా.. అద్దె వంటివి లేకున్నా వాటిని ఎమర్జెన్సీ ఫండ్స్‌కి డైవర్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా మీరు స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారు. ఈ ప్లానింగ్ లేకుంటే మీరు ఎంత సంపాదించినా.. రోజూ డబ్బు గురించి ఆలోచిస్తూ, భయపడుతూ ఉండాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

