అన్వేషించండి

APPSC Group1 Options Edit: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, ఆప్షన్లలో మార్పులకు మరో అవకాశం కల్పించిన ఏపీపీఎస్సీ

APPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు తమ మాధ్యమం, పోస్టులు, జోనల్‌ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల మార్పులు చేర్పులకు కమిషన్ అవకాశం కల్పించింది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 2 వరకు మార్చుకోవచ్చు.

APPSC Group-1 Post Preferences: ఏపీలో గ్రూప్‌-1 మెయిన్ పరీక్షకు సంబంధించి ఆప్షన్ల మార్చుకోవడానికి ఏపీపీఎస్సీ మరోసారి అవకాశం కల్పించింది. అభ్యర్థులు పరీక్ష రాసే మాధ్యమం, పోస్టులు, జోనల్‌ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 2 వరకు మార్చుకునే వెసులుబాటును కల్పించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును ఏపీపీఎస్సీ మార్చి 21న ప్రకటించింది. దీనిప్రకారం మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది. 

APPSC Group1 Options Edit: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, ఆప్షన్లలో మార్పులకు మరో అవకాశం కల్పించిన ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలును ఏపీపీఎస్సీ మార్చి 21న ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 3న తెలుగు పేపర్, మే 4న ఇంగ్లిష్ పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మే 5 నుంచి 9 వరకు జరిగే పరీక్షలను మాత్రమే ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5న పేపర్-I, మే 6న పేపర్-II, మే 7న పేపర్-III, మే 8న పేపర్-IV, మే 9న పేపర్-V పరీక్షలు నిర్వహించనున్నారు.    

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పేపర్లు ఇలా..

పేపర్-I - ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ఇతివృత్తాలు మరియు అంశాలపై జనరల్ ఎస్సే

పేపర్-II - భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సాంస్కృతిక మరియు భౌగోళిక శాస్త్రం

పేపర్-III - రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం మరియు నీతి

పేపర్-IV - భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి

పేపర్-V - సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు.

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 (84.67 %)  మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో   పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 పరీక్షకు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

మెయిన్స్ పరీక్ష విధానం..
మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Embed widget