Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
భారత్- న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ కు స్టార్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ), హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) దూరమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరి ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట టీమ్ మేనేజ్‌మెంట్. ముఖ్యంగా 2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వన్డే సిరీస్‌కు దూరమైనా న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో మాత్రం బుమ్రా, హార్దిక్ ఆడనున్నారు. ఈ టీ20 సిరీస్ వరల్డ్ కప్‌కు ముందు జరిగే చివరి మ్యాచ్ కావడంతో, ఐదు మ్యాచ్‌ల్లో వీళ్లు ఆడే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అలాగే జస్ప్రీత్ బుమ్రా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ODI ఫార్మాట్ లో ఆడలేదు.
ఇక విజయ్ హజారే ట్రోఫీలో సంచనాలు సృష్టిస్తున్న సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ), రోహిత్ శర్మ ( Rohit Sharma ) న్యూజీలాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో ఆడనున్నట్టుగా తెలుస్తుంది. దేశావళి క్రికెట్ లో సత్తా చాటుతున్న ఈ ఇద్దరిపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.





















