Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
న్యూజిలాండ్-భారత్ ( India vs New Zealand ) మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఒక అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో 68 ఇన్నింగ్స్‌ల్లో 2,966 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో 34 రన్స్ చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచే అవకాశముంది.
అలాగే శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ), విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో, విరాట్ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధిస్తే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మూడువేల పరుగులు చేసిన నాలుగో బ్యాటర్ అవుతాడు. అలాగే వీవీయన్ రిచర్డ్స్‌తో ( Vivian Richards ) సమంగా నిలుస్తాడు.
గాయం బారిన పడిన శ్రేయస్ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేతో టీమ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మంచి ఫార్మ్ ను కొనసాగిస్తున్నాడు.





















