అన్వేషించండి

AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు

Indradhanusu Scheme | దివ్యాంగుల కోసం ఉచిత బస్సు నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అర్హతలు, ఎందులో ఉచితంగా ప్రయాణించవచ్చో ప్రకటించింది.

Free Bus Travel for Differently Abled | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దివ్యాంగుల కోసం ఉచిత బస్సు నిర్ణయంపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంద్రధనుస్సు' పథకంలో భాగంగా, ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది.

అర్హతలు, వర్తించే బస్సులు

ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం పొందడానికి కొన్ని నిబంధనలను సంస్థ ఖరారు చేసింది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఎటువంటి టికెట్ ఛార్జీ చెల్లించకుండా ప్రయాణించవచ్చు. కేవలం దివ్యాంగులకే కాకుండా, వారికి తోడుగా వచ్చే సహాయకులకు (Escorts) కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎండీ స్పష్టం చేశారు.

ఈ నెల 18న ప్రారంభం

ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కండక్టర్లు, డ్రైవర్లకు అవసరమైన అవగాహన కల్పిస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

నెలకు రూ. 6,000 పింఛన్.. నెలరోజుల్లోపు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ

దివ్యాంగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఇటీవల ఈ విషయాలు వెల్లడించారు.

బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ: దివ్యాంగుల కోసం కేటాయించిన బ్యాక్‌లాగ్ ఉద్యోగ ఖాళీలను వచ్చే మార్చి నెల లోపు (నెలరోజుల్లోపు) పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దివ్యాంగుల సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

దేశంలోనే అత్యధిక పింఛన్: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, ఆంధ్రప్రదేశ్‌లోనే దివ్యాంగులకు నెలకు రూ. 6,000 పింఛన్ అందిస్తూ వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన గుర్తు చేశారు. కేవలం పింఛన్లు మాత్రమే కాకుండా.. విద్య, ఉపాధి మరియు రవాణా రంగాల్లో దివ్యాంగులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget