Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ( WPL 2026 ) భాగంగా ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్ ( Mumbai Indians vs Gujarat Giants ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో తన టీమ్ కు విజయాన్ని అందించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. జార్జియా వేర్‌హామ్, కనిక అహుజా, భార్టి ఫుల్మాలి ఇలా అందరు రాణించారు. అయితే ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur ) 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71 నాటౌట్ గా నిలిచింది. అమన్‌జోత్ కౌర్ ( Amanjot Kaur ) 26 బంతుల్లో 40 రన్స్ చేసింది.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది.





















