అన్వేషించండి

Ugadi 2026: ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!

Ugadi 2026: శ్రీ పరాభవ  నామ సంవత్సర ఉగాది మార్చి 19 గురువారం వచ్చింది. ఈ పర్వదినాన్ని పంచవిధుల సమన్వితంగా సూచించింది 'ధర్మసింధు'

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉగాది రోజు నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేసి స్నానం చేయాలి.
  • నూతన సంవత్సర స్తోత్రం, ఇష్టదేవత పూజ, పంచాంగ శ్రవణం తప్పక చేయాలి.
  • వేపపువ్వు, బెల్లం, చింతపండుతో ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యం చేకూరుస్తుంది.
  • పూర్ణకుంభదానంతో పాటు, దేవాలయాల్లో పంచాంగ శ్రవణం చేయాలి.

 Parabhava Nama Samvatsara Ugadi 2026: మార్చి 19 ఉగాది. ఈ రోజు తప్పనిసరిగా ఆచరించాల్సిన 5 విధులు ఇవే..

1. తైలాభ్యంగనం - నువ్వుల నూనె రాసుకుని స్నానం ఆచరించడం

2. నూతన సంవత్సరాది స్తోత్రం - నూతన సంవత్సర ప్రారంభ శ్లోకం

3. నింబకుసుమ భక్షణం - ఉగాది పచ్చడి తినడం

4. ధ్వజారోహణం - పూర్ణకుంభదానం

5. పంచాంగ శ్రవణం - పంచాంగం వినడం

ఈ ‘పంచకృత్య నిర్వహణ’ చేయాలని సూచించింది ధర్మసింధు
 
తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనె రాసుకుని తలంటు పోసుకోవడం. ఉగాది వంటి శుభదినాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం కన్నా ముందే స్నానం ఆచరించాలి. 
“అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం” 
అభ్యంగన స్నానం సర్వ అవయవాల పుష్టిదాయకం అని ఆయుర్వేదోక్తి.. అభ్యంగన స్నానం ఆరోగ్యం కూడా
 
నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానం తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం మామిడి ఆకుల తోరణాలతో, పూల తోరణాలతో దేవుడి మందిరంలో మంటపాన్ని అలంకరించి నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతను పూజించి ప్రసాదాన్ని నివేదించాలి
 
ఉగాది పచ్చడి సేవనం

ఉగాది పండుగలో పచ్చడి తీసుకోవడం అత్యంత ప్రధానమైనది. వేప పువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు.. వీటితో పాటూ చెరకు, పుట్నాల పప్పు కూడా మిక్స్ చేస్తారు కొందరు.  
 
అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం 
పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌

ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అంతా సేవించాలి. ఉగాది రోజు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరం మొత్తం సౌఖ్యంగా ఉంటుందని ఈ శ్లోకం భావం. పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా.సంతోషానికి పొంగిపోవద్దు, దుంఖానికి కుంగిపోవద్దు అనే సత్యాన్ని చాటుతూ..జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనం అని వివరిస్తుంది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి సేవిస్తే అనారోగ్యం తగ్గుతుందని, ఆరోగ్యంంగా ఉంటారని చెబుతారు పండితులు

పూర్ణ కుంభదానం

ఉగాది రోజు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపనను అనుసరిస్తారు. ఓ పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకంలా కట్టి దానిపై కొబ్బరికాయతో ఉన్న కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడి ఆకులు, పత్రాలు, పూలు, వేపఆకులు కట్టి ఇంటి ప్రాంగణంలో పెట్టి పూజిస్తారు. ఈ ఆచారాన్ని అనుసరించేవారి సంఖ్య ఇప్పుడు తగ్గింది..ఆ స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం, మట్టితో చేసిన కొత్త కుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పుష్పాలు, అక్షతలు వేసి పూజించి కలశానికి ఓ నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బొండాం ఉంచి పూజించి పండితులకు దానం ఇవ్వాలి. పూర్ణకుంభం దానం ఇస్తే ఏడాదంతా భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం
 
పంచాంగ శ్రవణం
 
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం...వీటినే పంచాంగాలు అంటారు. ఇవన్నీ కలసి ఉండేవే పంచాంగం. ఉగాది రోజు ఆలయంలో గ్రామ కూడలి ప్రదేశాల్లో, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయ ఫలాలు తెలుసుకుని ఏడాది పొడవునా ఎలా ఉండాలో ముందుగానే తెలుసుకోవడం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నానం చేసేంత ఫలితం లభిస్తుందని విశ్వాసం

ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసేవారికి..

సూర్యుడు శౌర్యాన్ని 
చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని
కుజుడు శుభాన్ని
శని ఐశ్వర్యాన్ని
రాహువు బాహుబలాన్ని
కేతువు కులాధిక్యతను 
కలిగిస్తారని నమ్మకం.. ‘బ్రహ్మ ప్రళయం’ పూరైన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతి కల్పంలో వచ్చే యుగాదిని ఉగాది అంటారు.  

ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు చదవాల్సిన శ్లోకం
 
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Frequently Asked Questions

ఉగాది నాడు తైలాభ్యంగనం ఎందుకు చేయాలి?

ఉగాది వంటి శుభదినాల్లో తైలాభ్యంగనం (నువ్వుల నూనె రాసుకుని స్నానం) చేయడం వల్ల సర్వ అవయవాలు పుష్టిగా ఉంటాయని, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.

ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు. ఇది సంవత్సరం మొత్తం సౌఖ్యాన్నిస్తుందని, అనారోగ్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుందని నమ్మకం.

పూర్ణ కుంభదానం అంటే ఏమిటి మరియు దాని ప్రాముఖ్యత ఏమిటి?

పూర్ణ కుంభదానం అనేది కలశాన్ని పూజించి, దానిని పండితులకు దానం చేయడం. దీనివల్ల ఏడాది పొడవునా భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

పంచాంగ శ్రవణం అంటే ఏమిటి?

పంచాంగ శ్రవణం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగాలను వినడం. దీనివల్ల ఏడాది పొడవునా జరగబోయే కందాయ ఫలాలను ముందుగానే తెలుసుకోవచ్చు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget