Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్ ముందు అభిషేక్ విధ్వంసం
గత కొంతకాలంగా మంచి ఫార్మ్ లో కొనసాగుతున్న టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ప్రత్యర్థి బౌలర్లకు తన బ్యాటింగ్ తోనే ఇన్డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. జైపూర్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా గంట వ్యవధిలో 45 సిక్సర్లు బాదేశాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నాడు అభిషేక్ శర్మ. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో కేవలం గంట వ్యవధిలోనే 45 సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో కేవలం సింగిల్స్, డబుల్స్ మాత్రమే కాదు.. కొన్ని బాల్స్ ను స్టాండ్స్‌లోకి కూడా పంపాడట ఈ యంగ్ ప్లేయర్. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరపున ఆడుతున్నాడు అభిషేక్ శర్మ.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 కోసం టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ.. వరల్డ్ కప్ లో కూడా ఇదే తరహాలో బ్యాటింగ్ చేయాలనీ ఆశిస్తున్నారు టీమ్ ఇండియా ఫ్యాన్స్.





















