APPSC Exams Schedule: ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు వెల్లడి - జేఎల్, డిగ్రీ లెక్చరర్, టౌన్ ప్లానింగ్ పోస్టులకు ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
APPSC: ఏపీలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 5 రకాల ఉద్యోగాల భర్తీకి జూన్ 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనుంది.

APPSC Exams Dates: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివిధ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. ఇందులో పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన తేదీలు ఉన్నాయి. వీటితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 16 నుంచి 26 మధ్య కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. అయితే జూన్ 20-22 మధ్య మాత్రం ఎలాంటి పరీక్షలు ఉండవు.
ఇతర పరీక్షల తేదీలు ఇలా..
ఏపీ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు, మెడికల్ అండ్ వెల్ఫేర్ సర్వీస్ విభాగంలో లైబ్రేరియర్ పోస్టులకు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెన్‌ట్లీ ఏబుల్డ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
➼ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
➼ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసులో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 27, 28 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
➼ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసులో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 28, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
➼ ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
➼ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీసులో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహించనున్నారు.
➼ దివ్యాంగులు ట్రాన్స్‌జెంబర్, సీనియర్ సిటీజెన్స్ సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరైక్టర్ పోస్టులకు ఏప్రిల్ 27, 28 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
➼ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
➼ ఏపీ ఫిషరీస్ విభాగంలో ఏప్రిల్ 28, 29 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..
➼ అసిస్టెంట్ డైరెక్టర్ - ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్
ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం), పేపర్-2(మధ్యాహ్నం).
ఏప్రిల్ 29: పేపర్-3 (ఉదయం).
➼ లైబ్రేరియన్ - మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసు
ఏప్రిల్ 27: పేపర్-2(ఉదయం).
ఏప్రిల్ 28: పేపర్-1 (ఉదయం).
➼ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్
ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం).
ఏప్రిల్ 30: పేపర్-2(ఉదయం), పేపర్-3 (మధ్యాహ్నం).
➼ అసిస్టెంట్ డైరైక్టర్ - దివ్యాంగులు ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటీజెన్స్ వెల్ఫేర్
ఏప్రిల్ 27: పేపర్-2(మధ్యాహ్నం).
ఏప్రిల్ 28: పేపర్-1 (ఉదయం).
➼ అసిస్టెంట్ కెమిస్ట్ - ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్
ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం), పేపర్-2 (మధ్యాహ్నం).
ఏప్రిల్ 29: పేపర్-3 (ఉదయం).
➼ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ - ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీస్.
ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం), పేపర్-2(మధ్యాహ్నం).
➼ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ - ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం).
ఏప్రిల్ 29: పేపర్-2 (మధ్యాహ్నం)
➼ ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - ఏపీ ఫిషరీస్ సర్వీస్
ఏప్రిల్ 28: పేపర్-1(ఉదయం).
ఏప్రిల్ 30: పేపర్-2 (ఉదయం), పేపర్-3 (మధ్యాహ్నం).
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

