AP DME: ఏపీలో 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా
AP Senior Resident Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీనియర్ రెసిడెంట్ మొత్తం 1183 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

AP Senior Resident Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1183 పోస్టులను ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం/ ఎండీఎస్) ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 1183
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం/ ఎండీఎస్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. ఏపీ రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థులు ఎంపికకు అర్హులు. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఎపీ మెడికల్/ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్న స్థానికేతర అభ్యర్థులు సీనియర్ రెసిడెన్సీ పోస్టులకి అర్హులు.
వయోపరిమితి: O5.O3.2O25 నాటికి 44 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.2000, బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
వేతనం: నెలకు రూ.97,750 ఉంటుంది.
పదవీకాలం: ఒక సంవత్సరం. ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా ఒక సంవత్సరం కాల వ్యవధిని పూర్తి చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2025.
దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్‌లు..
➥ పుట్టిన తేదీ ద్రువీకరించే 10వ తరగతి సర్టిఫికేట్.
➥ ఏపీ మెడికల్ కౌన్సిల్‌తో పీజీ డిగ్రీ రిజిస్ట్రేషన్
➥ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) మార్కుల లిస్ట్.
➥ డిగ్రీ/ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ కాపీ
➥ ఎంబీబీఎస్/బీడీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ ఎండీఎస్)
➥ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్(ఎస్సీ/ఎస్టీ/బీసీఏ/బీసీబీ/బీసీసీ/బీసీడీ/బీసీఈ/ఈడబ్ల్యూఎస్)
➥ ఆధార్ కార్డ్
➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్.
ALSO READ:
ఎయిమ్స్ కళ్యాణిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
AIIMS Kalyani conduct Walk-In-Interview: వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, నదియా జిల్లా, కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపరికన వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఏయిమ్స్‌లో లేదా బయట జూనియర్ రెసిడెన్సీ (నాన్-అకడమిక్)లో ఇప్పటికే 2 సార్లు జూనియర్ రెసిడెన్సీ పూర్తి చేసిన అభ్యర్థులను పరిగణించరు. ఆర్మీ సేవలు, సెంట్రల్ హెల్త్ సర్వీసెస్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ & ప్రైవేట్ ప్రాక్టీస్‌లో అనుభవం జూనియర్ రెసిడెన్సీ (నాన్-అకడమిక్)కి సమానంగా పరిగణించబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, ఇతర కమ్యూనిటీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 18న ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.





















