అన్వేషించండి

కొత్త ahindra XUV 7XO లో 6 వేరియంట్లు - వేరియంట్‌ ధర, ఫీచర్ల వారీగా మీకో క్లారిటీ ఇచ్చే ఫుల్‌ గైడ్‌ ఇదిగో

2026 Mahindra XUV 7XO ఆరు ట్రిమ్‌లలో లభిస్తోంది. ధర, ఇంజిన్‌, ఫీచర్ల ఆధారంగా మీ బడ్జెట్‌కు సరిపోయే బెస్ట్‌ XUV 7XO వేరియంట్‌ ఏదో తెలుసుకోండి.

Mahindra XUV 7XO Variants Price And Features: మహీంద్రా 2021లో లాంచ్‌ చేసిన XUV700, ఇండియన్‌ SUV మార్కెట్‌లో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి మిడ్‌ సైకిల్‌ అప్‌డేట్‌గా వచ్చిన మోడలే 2026 Mahindra XUV 7XO. పేరు మాత్రమే కాదు, డిజైన్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో కూడా పెద్ద మార్పులతో ఈ SUV మన ముందుకు వచ్చింది. అయితే, XUV 7XOలో ఆరు ట్రిమ్‌లు ఉండటంతో, ఏ వేరియంట్‌ కొనాలి? అనే సందేహం చాలా మందికి వస్తోంది. ఇక్కడ ఆ సందేహానికి స్పష్టమైన సమాధానం తెలుసుకుందాం.

XUV 7XO ధరలు & ఇంజిన్‌ ఆప్షన్లు

Mahindra XUV 7XO ధరలు రూ.13.66 లక్షల నుంచి రూ.24.92 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉన్నాయి. ఈ ధరలు తొలి 40,000 డెలివరీల వరకు మాత్రమే వర్తిస్తాయి.

ఇంజిన్‌ విషయానికి వస్తే, పాత XUV700లో ఉన్నవే కొనసాగుతున్నాయి.

2.0 లీటర్‌ mStallion టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ - 203hp, 380Nm

2.2 లీటర్‌ mHawk డీజిల్‌ ఇంజిన్‌ - 185hp, గరిష్టంగా 450Nm

మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ SUVకి ప్రధాన ప్రత్యర్థులు -   Hyundai Alcazar, MG Hector Plus, Tata Safari.

AX ట్రిమ్‌ - ఎంట్రీ లెవల్‌ అయినా ఫీచర్లలో బలం
AX ట్రిమ్‌ ధర: రూ.13.66 లక్షలు నుంచి

ఇది ఎంట్రీ లెవల్‌ అయినప్పటికీ, ట్రిపుల్‌ 12.3 అంగుళాల స్క్రీన్‌ సెటప్‌, వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto, AdrenoX కనెక్టెడ్‌ టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESC వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ కంట్రోల్‌లో పెట్టుకుని, పెద్ద SUV కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.

AX3 ట్రిమ్‌ - డైలీ యూజ్‌కు మరింత కంఫర్ట్‌
AX3 ట్రిమ్‌ ధర: రూ.16.02 లక్షలు నుంచి

AXలో ఉన్న ఫీచర్లతో పాటు, రియర్‌ వ్యూ కెమెరా, ఆటో ఫోల్డ్‌ ORVMలు, రియర్‌ వైపర్‌, డిమిస్టర్‌ లాంటి రోజువారీ ఉపయోగకరమైన ఫీచర్లు ఇక్కడ అదనంగా వస్తాయి. నగర వినియోగానికి ఇది మంచి బ్యాలెన్స్‌ వేరియంట్‌.

AX5 ట్రిమ్‌ - ఫ్యామిలీ SUVగా బెస్ట్‌ బ్యాలెన్స్‌
AX5 ట్రిమ్‌ ధర: రూ.17.52 లక్షల నుంచి

ఈ ట్రిమ్‌లో XUV 7XO మరింత ప్రీమియంగా అనిపిస్తుంది. AX3 ట్రిమ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు పానోరమిక్‌ సన్‌రూఫ్‌, అలాయ్‌ వీల్స్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు, టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌ వంటి ఫీచర్లు ఫ్యామిలీ కొనుగోలుదార్లకు బాగా ఉపయోగపడతాయి.

AX7 ట్రిమ్‌ - డబ్బుకు పూర్తి విలువ
AX7 ట్రిమ్‌ ధర: రూ.18.48 లక్షలు నుంచి

సుమారు రూ.20 లక్షల బడ్జెట్‌లో బెస్ట్‌ వాల్యూ వేరియంట్‌ ఇదే. AX5 ట్రిమ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు లెదరెట్‌ సీట్లు, డ్యూయల్‌ జోన్‌ ఆటో క్లైమేట్‌ కంట్రోల్‌, సర్‌రౌండ్‌ వ్యూ కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ముందు, వెనుక సీట్లలో కూర్చునే వారందరికీ మంచి కంఫర్ట్‌ ఇస్తుంది.

AX7T (Tech) - టెక్నాలజీ లవర్స్‌ కోసం
AX7T ట్రిమ్‌ ధర: రూ.20.99 లక్షలు నుంచి

AX7 ట్రిమ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు, ఇందులో Level 2 ADAS, అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌, 16 స్పీకర్‌ Harman Kardon ఆడియో, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ వంటి హైఎండ్‌ టెక్‌ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవింగ్‌ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది సరైన ఎంపిక.

AX7L (Luxury) - పూర్తి లగ్జరీ అనుభవం
AX7L ట్రిమ్‌ ధర: రూ.22.47 లక్షలు నుంచి

ఇది టాప్‌ ఎండ్‌ వేరియంట్‌. AX7T ట్రిమ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు, ఇందులో వెంటిలేటెడ్‌ సెకండ్‌ రో సీట్లు, రియర్‌ సన్‌బ్లైండ్స్‌, పవర్డ్‌ కో-డ్రైవర్‌ సీట్‌తో పవర్డ్‌ Boss మోడ్‌, రియర్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్‌తో ప్రయాణించే వారికి ఇది బెస్ట్‌ ఎంపిక.

ఏ ట్రిమ్‌ తీసుకోవాలి?
మీ బడ్జెట్‌ దాదాపు రూ.20 లక్షలయితే, AX7 ట్రిమ్‌ మీ డబ్బుకు పూర్తి విలువ ఇస్తుంది. మీకు ఓ డ్రైవర్‌ ఉంటే, కెప్టెన్‌ సీట్లు, వెంటిలేషన్‌, లగ్జరీ ఫీల్‌ కావాలంటే AX7L ట్రిమ్‌ తీసుకుంటే నిరాశ ఉండదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget