Nepal T20 World Cup Team: టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నేపాల్.. గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న ఆసియా టీం
టీ20 ప్రపంచ కప్ 2024లో నిరాశపరిచే ప్రదర్శన చేసిన నేపాల్ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని చూస్తోంది. స్పిన్, ఆల్రౌండర్లు, బ్యాటింగ్ లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై ఫోకస్ చేసింది.

T20 World Cup Nepal Squad | టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే పలు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం నేపాల్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. రోహిత్ పౌడెల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవమరిస్తాడు. దీపేంద్ర సింగ్ ఐరీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
23 ఏళ్ల ఆల్ రౌండర్ రోహిత్ పౌడెల్ తన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలు అందించాడు. క్రికెట్‌లో నేపాల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచ కప్‌లో అతనికి దీపేంద్ర సింగ్ ఐరీ డిప్యూటీగా మద్దతు అందించనున్నాడు. దీపేంద్ర ఆల్-రౌండ్ సామర్థ్యం క్రికెట్‌లో నేపాల్ జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. నేపాల్ క్రికెట్‌కు పేరు రావాలంటే ఈ పొట్టి ప్రపంచ కప్‌లో ఏదైనా సంచనలనం చేయాలని వీరు భావిస్తున్నారు.
గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని
నేపాల్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2024లో తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈసారి తమ ప్రదర్శనను మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. నేపాల్ జట్టు 15 మంది సభ్యుల ఈ జట్టు స్పిన్, ఆల్-రౌండర్లతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాలను పటిష్టం చేసింది. ముఖ్యంగా ఆల్ రౌండ్ ప్లేయర్లపై ఫోకస్ చేసింది.
సందీప్ లామిచానే స్పిన్ అటాక్‌ను లీడ్ చేస్తాడు. అతడికి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ లలిత్ రాజ్‌బన్షితో కలిసి స్పిన్ విభాగాన్ని లామిచానే నడిపించనున్నాడు. దీపేంద్ర సింగ్ ఐరీ, బషీర్ అహ్మద్ వంటి ఇతర స్పిన్నర్ల నుంచి వారికి సహకారం ఉంటుంది. దీపేంద్ర, గుల్షన్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కామి ఆల్-రౌండర్లుగా నేపాల్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నారు.
కుశాల్ భుర్తేల్ జట్టుకు దూకుడుగా ఆరంభాన్ని అందించనున్నాడు. ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచే బాధ్యతను తీసుకుంటాడు.సందీప్ జోరా, నందన్ యాదవ్ మొదటి ఆరుగురు బ్యాటర్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. సోంపాల్ కామి, కరణ్ కేసీ పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో నేపాల్ గ్రూప్ సిలో ఉంది. నేపాల్ ఫిబ్రవరి 8న ఇంగ్లాండ్‌ను ఎదుర్కొంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఇటలీతో తలపడనుంది. ఈ ఆసియా జట్టు ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 17న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. విండీస్, బంగ్లాదేశ్ వీరికి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ కోసం నేపాల్ జట్టు: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కుశాల్ భుర్తేల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బషీర్ అహ్మద్, సోంపాల్ కామి, కరణ్ కేసీ, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బమ్.




















