Watch IPL For Free: ఐపీఎల్ మ్యాచ్‌లు 'ఫ్రీ'గా చూస్తారా? - మీ మొబైల్ నంబర్‌ను రీఛార్జ్ చేస్తే చాలు
JioHotstar Freer Subscription: జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రైవేట్ టెలికాం కంపెనీలు డేటా ప్లాన్‌లను తీసుకొచ్చాయి. వాటిలో ఒక ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే చాలు, ఐపీఎల్‌ను ఉచితంగా చూడొచ్చు.

Watch IPL Matches for Free on JioHotstar: క్రికెట్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' 2025 (IPL 2025) సందడి ఈ రోజు (మార్చి 22, 2025) నుంచి ప్రారంభం అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో IPL 2025 సీజన్ స్టార్ట్ అవుతుంది. చాలా ఐపీఎల్ మ్యాచ్‌లు నరాలు తెగే ఉత్కంఠతో, క్రికెట్ ప్రియులను కుర్చీ అంచున కూర్చోబెడుతుంటాయి. ఇలాంటి థ్రిల్ కోసమే క్రికెట్ ప్రేమికులు, ముఖ్యంగా యువత ఐపీఎల్ మ్యాచ్‌లంటే పడిచస్తుంటారు. దాదాపు రెండు నెలలకు పైగా సాగే లీగ్‌ను చూసేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ ఏడాది, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (JioHotstar Subscription) ఉంటేనే ఐపీఎల్ 2025 సీజన్‌ను చూడగలరు.
ఈ ఏడాది ఉచిత ప్రసారం లేదు
గత రెండు సీజన్లలో (2023, 2024), జియో సినిమా (JioCinema) ప్లాట్‌ఫామ్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేశారు. ఇప్పుడు జియో సినిమా లేదు కాబట్టి, జియో హాట్‌స్టార్‌లో మాత్రమే క్రికెట్ చూడాలి & దీనికోసం డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.
IPL మ్యాచ్‌లను ఉచితంగా చూసే మార్గం
జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు ఒక సులువైన మార్గం కూడా ఉంది. మీ మొబైల్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకుంటే చాలు. మన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు - రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఈ అవకాశం కల్పిస్తున్నాయి. ఈ మూడు కంపెనీలు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను లాంచ్ చేశాయి. ఈ మూడు టెలికాం కంపెనీల్లో మీ దగ్గర ఏ కంపెనీ సిమ్ ఉన్నా, ఆ సిమ్‌ను నిర్దిష్ట డేటా ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది, మీరు ఉచితంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయవచ్చు.
జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రిలయన్స్ 'జియో' రీఛార్జ్ ప్లాన్‌లు (Jio recharge plans with JioHotstar subscription)
* రూ.100 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. 5 GB డేటా వస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీతో JioHotstar సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
* రూ.299 లేదా అంతకంటే ఎక్కువ: రూ.299 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్నా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది, ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే.
జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో 'ఎయిర్‌టెల్' రీఛార్జ్ ప్లాన్‌లు (Airtel recharge plans with JioHotstar subscription)
* రూ.100 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడీటీ 30 డేస్. 5 GB డేటా వస్తుంది. 30 డేస్ వ్యాలిడిటీతో JioHotstar సబ్‌స్క్రిప్షన్‌కు అర్హత లభిస్తుంది.
* రూ.195 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడీటీ 90 డేస్. 15 GB డేటా లభిస్తుంది. 90 డేస్ వ్యాలిడిటీతో JioHotstar సబ్‌స్క్రిప్షన్ మీ చేతికి వస్తుంది.
జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో 'వొడాఫోన్ ఐడియా' రీఛార్జ్ ప్లాన్‌లు (Vodafone Idea recharge plans with JioHotstar subscription)
* రూ.101 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడీటీ 30 డేస్. 3 GB డేటా కూడా యాడ్ అవుతుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు సహా 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ కంటెంట్ చూడొచ్చు.
* రూ.151 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడీటీ కూడా 30 రోజులు. ఈ ప్లాన్‌లో 4 GB డేటా లభిస్తుంది. 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ ఉంటుంది.
* రూ.169 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడీటీ 30 డేస్. దీంతోపాటు 8 GB డేటా లభిస్తుంది. 30 డేస్ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోండి, ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూడండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

