మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమల్లోకి తెచ్చేందుకు సిద్దమైన హిల్ట్ పాలసీ (HILT Policy) తీవ్ర వివాదంగా మారింది. హైదరాబాద్ (Hydrabad) నగరంలోని వివిధ ప్రాంతాల్లో 9300 ఎకరాల్లో ఉన్న పరిశ్రమలు సిటీ వెలుపలకు తరలించి, ఆ భూముల్లో కమర్షియల్ , రెసిడెన్సిషియల్ నిర్మాణాలు చేపట్టడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశ్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, సిటీ లోపల కాలుష్యం తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెంచేందుకే ఈ ప్రాజెక్ట్ తెచ్చామని అధికార పార్టీ నేతలంటున్నారు. ఇదిలా ఉంటే హిల్ట్ పాలసీ అమల్లోకి వస్తే వందలాది పరిశ్రమలు తరలిపోవడమేకాదు, వీటిపై ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయంటూ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడి పరిశ్రలే నమ్మకుని కుటుంబాన్ని పోషిస్తున్నాం, ఇప్పుడు ఉపాధిపోతే ఎలా బ్రతకాలంటూ నిలదీస్తున్నారు.తెలంగాణలో హిల్ట్ పాలసీ కార్మికుల జీవితాలపై ఎంతవరకూ ప్రభావం చూపనుంది. కార్మికుల అభ్యంతరాలేంటి..? ABP Desam గ్రౌండ్ రిపోర్టు.





















