search
×

Gold-Silver Prices Today 22 Mar: రూ.90,000కు దిగొచ్చిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,00,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 27,030 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices Today: యూఎస్‌ డాలర్‌ బలపడడం, ప్రతీకార టారిఫ్‌లపై చర్చలు ఉంటాయని అమెరికా అధికార్లు ప్రకటించడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు తగ్గింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 3,028 డాలర్ల దగ్గర ఉంది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 440 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 400 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 330 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర 1000 రూపాయలు తగ్గింది. పన్నులతో కలుపుకుని, ప్రస్తుతం, 10 గ్రాముల ప్యూర్‌ గోల్డ్‌ (24K) ధర రూ. 90,200 వద్ద ఉంది & కిలో వెండి రూ. లక్ష ధర పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) (పన్నులు లేకుండా)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,780 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,340 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,00,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh) (పన్నులు లేకుండా)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,780 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 82,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,340 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,00,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 89,780  ₹ 82,300  ₹ 67,340  ₹ 1,00,000 
విజయవాడ ₹ 89,780 ₹ 82,300  ₹ 67,340  ₹ 1,00,000 
విశాఖపట్నం ₹ 89,780  ₹ 82,300  ₹ 67,340  ₹ 1,00,000 

 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 8,230 ₹ 8,978
ముంబయి ₹ 8,230 ₹ 8,978
పుణె ₹ 8,230 ₹ 8,978
దిల్లీ ₹ 8,245 ₹ 8,998
 జైపుర్‌ ₹ 8,245 ₹ 8,998
లఖ్‌నవూ ₹ 8,245 ₹ 8,998
కోల్‌కతా ₹ 8,230 ₹ 8,978
నాగ్‌పుర్‌ ₹ 8,230 ₹ 8,978
బెంగళూరు ₹ 8,230 ₹ 8,978
మైసూరు ₹ 8,230 ₹ 8,978
కేరళ ₹ 8,230 ₹ 8,978
భువనేశ్వర్‌ ₹ 8,230 ₹ 8,978

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,940 ₹ 8,574
షార్జా ‍‌(UAE) ₹ 7,940 ₹ 8,574
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,940 ₹ 8,574
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 8,081 ₹ 8,630
కువైట్‌ ₹ 7,787 ₹ 8,491
మలేసియా ₹ 8,306 ₹ 8,657
సింగపూర్‌ ₹ 8,199 ₹ 9,016
అమెరికా ₹ 7,938 ₹ 8,434

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 140 తగ్గి రూ. 27,030 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

 

Published at : 22 Mar 2025 11:08 AM (IST) Tags: Hyderabad Gold Price Today Silver Price Today Vijayawada Todays Gold Silver rates

ఇవి కూడా చూడండి

UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్‌

UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్‌

PF Loan: డబ్బు అవసరనప్పుడు ఆదుకునే PF లోన్‌ - దరఖాస్తు చేయడం సులభం

PF Loan: డబ్బు అవసరనప్పుడు ఆదుకునే PF లోన్‌ - దరఖాస్తు చేయడం సులభం

Income Tax Benifit: కుటుంబంతో కలిసి జాలీగా హాలిడే ట్రిప్స్‌ వేయండి, పన్ను మిహాయింపు పొందండి

Income Tax Benifit: కుటుంబంతో కలిసి జాలీగా హాలిడే ట్రిప్స్‌ వేయండి, పన్ను మిహాయింపు పొందండి

GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం

GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం

Gold-Silver Prices Today 21 Mar: భారీగా పతనమైన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 21 Mar: భారీగా పతనమైన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం

Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం

IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..

IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..

బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ

బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత