బంగారం (గోల్డ్) కొనేముందు ఈ విషయాలు గుర్తించుకోండి

గోల్డ్​ని జ్యూవెలరీగా ధరించేందుకు, ఇన్వెస్ట్​మెంట్ పర్పస్ చాలామంది తీసుకుంటూ ఉంటారు.

అయితే బంగారం కొనేముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలంటున్నారు నిపుణులు.

మీరు దేనికోసం గోల్డ్ తీసుకుంటున్నారో తెలియాలి. ఇన్వెస్ట్​మెంట్​ కోసమా? జ్యూవెలరీ? కలెక్షన్స్ కోసమా అనేది తెలుసుకోండి.

మీరు మార్కెట్​లో ధరలు తెలుసుకుని దానికి తగ్గ డబ్బులను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

గోల్డ్ ప్యూరిటీ పట్ల అవగాహన ఉండాలి. 24K, 22K, 18K ఇలా రకరకాలు గోల్డ్​, వాటి ధరలు తెలుసుకుని వెళ్తే మంచిది.

గోల్డ్​ తీసుకునేప్పుడు హాల్​ మార్క్, ISO కచ్చితంగా ఉండాలని గుర్తించుకోండి. ఇవి చాలా ముఖ్యం.

ఫిజికల్ గోల్డ్ తీసుకోవాలనుకుంటే కాయిన్స్, బార్స్, bullion రూపంలో గోల్డ్ తీసుకోవచ్చు.

గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్​లు (exchange-traded funds), డిజిటల్ గోల్డ్​ ఇన్వెస్ట్​మెంట్ పర్పస్ తీసుకోవచ్చు.

జ్యూవెలరీ తీసుకుంటే.. ఎన్ని గ్రాములు, ప్యూరిటీ ఎంత, మజూరీ ఎంత పడుతుందో తెలుసుకోవాలి.

మీరు గోల్డ్ ఎక్కడ కొంటున్నారనేది కూడా ముఖ్యమే. ప్రామాణికతలు ఫాలో అవుతున్నారో లేదో కూడా తెలుసుకోవాలి.

రిటర్న్, ఎక్స్​ఛేంజ్ పాలసీలు ఉన్నాయో లేదో తెలుసుకుంటే మంచిది.

వాల్యూ యాడెడ్ టాక్స్, కాప్టిల్ గైయిన్స్ టాక్స్ ఇలాంటి వాటి గురించి కూడా తెలుసుకోవాలి.

బంగారం కొనే ముందు కంపేర్ చేసుకుని తీసుకుని కొనుక్కుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది.