గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ బ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. స్కిన్, హెల్తీ లైఫ్ కోసం ఉదయాన్నే ఫ్రూట్స్ తీసుకుంటుందట. ముఖ్యంగా యాపిల్స్ పీనట్ బటర్ తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటుంది. ఉదయాన్నే రన్నింగ్ చేస్తుంది. కనీసం 20 నిమిషాలు రన్ చేస్తుందట. ఇది స్కిన్‌కి మంచి గ్లో ఇస్తుందని తెలిపింది. కిక్ బాక్సింగ్ చేయడం వల్ల కొత్త ఎనర్జీ వస్తుందని తెలిపింది. దీనివల్ల స్కిన్ గ్లో అవుతుందట. స్కిన్ హైడ్రేటింగ్‌గా ఉండేలా చూసుకునేందుకు కియారా స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవుతుంది. మాయిశ్చరైజర్ రెగ్యూలర్‌గా ఉపయోగిస్తూ.. సన్‌స్క్రీన్‌ని తప్పక వాడుతుందట. శరీరానికి అవసరమైన న్యూట్రిష్రియన్స్ని అందిస్తే స్కిన్ హెల్తీగా ఉంటుందని తెలిపింది. పెరుగులో ఫ్రెష్ క్రీమ్‌ని కలిపి ముఖాన్ని స్క్రబ్ చేస్తుందట. నెలకోసారి దీనిని ఉపయోగిస్తుందట. టోమాటో పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతగా ఉంటుందని తెలిపింది.