ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో వివాహ వ్యవస్థ - పెరిగిపోతున్న విడాకుల కేసులు



విడాకులకు కారణం అవుతున్న వాటిలో మొట్టమొదటి విషయం వివాహేతర బంధాలు. ఒకరు ఒకరికే ఫిక్సయితే సమస్య ఉండదు.



విడాకులకు కారణం అవుతున్న రెండో అత్యధిక కారణం ఆర్థిక విషయాలు. మనది అనుకుంటే సమస్య పరిష్కారం



విడాకులకు కారణం అవుతున్న మూడో కారణం కమ్యూనికేషన్ - నిజం మనసు విప్పి మాట్లాడుకుంటే ఇది సమస్యే కాదు!



విడాకులకు నాలుగో కారణం వాదించుకోవడం - సీరియస్ వాదనలు తగ్గించుకుంటే కలిసుండే కాలం పెరుగుతుంది.



విడాకులకు ఐదో కారణం గొంతెమ్మ కోరికలు - భాగస్వామి నుంచి అంచనాలకు మించి ఆశించకుండా చాలు !



విడాకులకు ఆరో కారణం సాన్నిహిత్యం లేకపోవడం - జంటలు శృంగారం సహా అన్ని విషయాల్లోనూ ఓపెన్‌గా ఉండాలి..!



విడాకులకు ఏడో కారణం సమానత్వం లేకపోవడం - ఇద్దరూ సమానమేనని ఇద్దరూ అనుకుంటే సమస్యే రాదు



విడాకులకు ఎనిమిదో కారణం శారీరక, మానసిక హింస - లైఫ్ పార్టనర్ని కొట్టడం జన్మహక్కు అనుకునేవారు విడిపోవడానికి అవకాశాలెక్కువ.