ఇలా లైట్ తీస్కో..
టెన్షన్ ఎక్కువగా పడితే.. శారీరకంగా, మానసికంగా ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. ముఖ్యంగా మెంటల్ హెల్త్ సరిగ్గా లేక సరైన నిర్ణయాలు తీసుకోలేరు.
టెన్షన్‌ని తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్‌ని రెగ్యూలర్‌గా ఫాలో అయితే మంచిది. ఫిజికల్‌గా, మానసికంగా రిలాక్స్ అయ్యేందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి.
డీప్ బ్రీతింగ్ టెన్షన్లను దూరం చేస్తుంది. మెల్లగా.. డీప్ బ్రీత్ మిమ్మల్ని కామ్ చేస్తుంది. ఇది శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.
మసాజ్‌లు కూడా కండరాలను రిలాక్స్ చేస్తాయి. దీనివల్ల టెన్షన్ కూడా తగ్గుతుంది. టెన్షన్ అనిపించినప్పుడు మసాజ్‌కి ప్రియారిటీ ఇవ్వండి.
మీరు యోగాను రెగ్యూలర్‌గా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. టెన్షన్, యాంగ్జైటీ లక్షణాలు ఇది దూరం చేస్తుంది. తగ్గిస్తుంది కూడా.
రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తూ.. ఉంటే టెన్షన్ తగ్గుతుంది. అంతే కాకుండా శారీరకంగానూ, మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారు. టెన్షన్ పడరు.
ప్రజెంట్‌పై ఫోకస్ చేయండి. ఫ్యూచర్ గురించి కానీ.. జరిగిపోయిన దాని గురించి కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మెడిటేషన్ చేస్తే టెన్షన్ తగ్గుతుంది.
తీసుకునే ఫుడ్‌పై దృష్టి సారించండి. మీ తప్పులను మీరు క్షమించుకోండి. చేసే పని ఏంటి? మీరు ఎంతవరకు దానిపై వర్క్ చేయగలరో గుర్తించండి.
మీరు చేయాల్సిన పనులు.. మీ ఆలోచనలు.. మీ ఎమోషన్స్‌ని రాయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీరు చేసే పనులపై మీకు క్లారిటీ వస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది.
అప్పుడప్పుడు బయటకి వెళ్తూ ఉండండి. ప్రకృతిలో కాస్త సమయాన్ని గడిపితే.. ఒత్తిడి తగ్గుతుంది. మ్యూజిక్ కూడా మిమ్మల్ని హీల్ చేస్తుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు, థెరపీలు తీసుకుంటే చాలా మంచిది. (Images Source : Envato)