లవ్ డెయిరీ

రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొనే లవ్ స్టోరి అలా మొదలైంది

Published by: Geddam Vijaya Madhuri

కపుల్ గోల్స్

బాలీవుడ్ స్టార్ కపుల్స్​లో రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొనే ఒకరు. ఈ జంట్ లవ్ గోల్స్ సెట్ చేస్తూ ఉంటారు.

అలా మొదలైంది..

అసలు వీరి లవ్ స్టోరి ఎలా మొదలైంది. పెళ్లి వరకు ఎలా వెళ్లిందో ఇప్పుడు చూసేద్దాం.

రామ్ లీలతో..

దీపికా, రణ్​వీర్ కలిసి మొదటిసారి సంజయ్​ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన రామ్​ లీలలో నటించారు. వీరి ఫ్రెండ్​షిప్​ అక్కడే మొదలైంది.

సహజమైన కెమిస్ట్రీ..

అనంతరం బాజీరావ్ మస్తానీ సినిమా చేసింది ఈ జంట. ఈ సినిమా సమయానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు బాగా ఎక్కువయ్యాయి. పైగా సినిమాలో వారి కెమిస్ట్రీ అంత సహజంగా ఉంది.

కెమెరా ముందు నో..

కొన్నాళ్లు వీరి ప్రేమను మీడియా ముందు ప్రస్తావించేందుకు ఇబ్బంది పడ్డారు. కానీ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని మీడియాకు చిక్కేవారు.

పెళ్లితో చెక్

పద్మావత్ సినిమాలో దీపికా హీరోయిన్ కాగా.. రణ్​వీర్ విలన్ రోల్ ప్లే చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయిన సంవత్సరమే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి రోజు..

2012 నుంచి మొదలైన వీరి ప్రేమాయణం.. 2018లో నవంబర్ 14వ తేదీన పెళ్లి పట్టాలెక్కింది. తమ ప్రేమను పెళ్లితో అఫీషియల్ చేశారు ఈ జంట.

పెళ్లి తర్వాత కూడా ప్రేమే

రణ్​వీర్ సింగ్.. దీపికా పదుకొనేను చాలా అడ్మైర్ చేస్తూ ఉంటాడు. వీలు దొరికినప్పుడల్లా భార్యను ప్రైజ్ చేస్తూ ఉంటారు.

పాప కూడా..

రణ్​ వీర్, దీపికా పెళ్లైన ఆరేళ్ల తర్వాత వారు పేరెంట్స్ అయ్యారు. పాప పేరు Dua Padukone Singh అంటూ ఇటీవలె నామకరణం కూడా చేశారు.

కెరీర్..

పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ కెరీర్​ను ముందుకు సాగిస్తున్నారు. దీపికా ఖాతాలో అయితే మంచి హిట్స్​ కూడా పడ్డాయి.