ఆ సమస్యలున్నవారు పల్లీలు తినకపోవడమే మంచిదట.. ఎందుకంటే పల్లీలు నోటికి రుచిగా ఉంటాయి. పైగా వాటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. అయితే కొన్ని సమస్యలున్నవారు పల్లీలకు దూరంగా ఉంటే మంచిదంటున్నారు. ఫుడ్ అలెర్జీ ఉన్నవారు.. పల్లీలు తినకపోవడమే మంచిది. ఇది త్వరగా అలెర్జీలు ఇస్తుంది. గ్యాస్ సమస్యలున్నవారు కూడా పల్లీలు తినకూడదు. దీనిలో ఫైబర్, ప్రోటీన్ కడుపు ఉబ్బరాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలున్నవారు పల్లీలు తింటే.. కడుపు నొప్పి, డయోరియా రావొచ్చు. వీటిలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. పల్లీల్లో ఆక్సాలేట్స్ ఉంటాయి. ఇవి కిడ్నీ స్టోన్స్ని పెంచే అవకాశముంది. ఇవి రక్తాన్ని పలుచగా చేసి.. మధుమేహ సమస్యలన్ని పెంచుతుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.