యునైటెడ్ స్టేట్స్‌కు టూరిస్టుగా వెళ్లాలంటే కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్ ఉండాలి. ఆమెరికాలో పర్యటించడానికి అవసరమయ్యేంత ధనం ఉందని నిరూపించే పత్రాలు ఉండాలి. అమెరికా నుంచి ఎవరి పేరుపైనైనా వెళ్తూంటే వారిచ్చిన లేఖ కూడా ముఖ్యమే. మీరు ఉద్యోగులైతే మీ సంస్థలో సెలవు మంజూరు చేసినట్లుగా లేఖ గతంలో చేసిన విదేశీ పర్యటనల వివరాలు ఆన్‌లైన్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తు ఫారమ్ (DS-160) పూర్తి చేసి సమర్పించాలి వీసా కోసం దరఖాస్తే చేసేటప్పుడే ప్రయాణ, వసతి వివరాలు చెప్పాలి. B-1 మరియు B-2 US సందర్శకుల వీసాలు 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు ఒక వ్యక్తి కొద్ది కాలం, గరిష్టంగా 6 నెలల వరకు దేశంలో ఉండడానికి అనుమతి లభిస్తుంది