ఆరోగ్య ప్రయోజనాల కోసం.. ముఖ్యంగా బరువు తగ్గేందుకు చాలామంది క్వినోవాను డైట్లో చేర్చుకుంటున్నారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను అందించే క్వినోవాను తీసుకునేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. క్వినోవాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వేగన్ డైట్ ఫాలో అయ్యేవారికి ఇది ప్రోటీన్‌కు మంచి సోర్స్. ఫైబర్ పుష్కలంగా ఉండి.. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. క్వినోవాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా, క్యాన్సర్ కారకాల నుంచి కాపాడుతాయి. క్వినోవాను తీసుకున్నప్పుడు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే క్వినోవాను బాగా నానబెట్టి.. ఆ తర్వాతనే వండుకోవాలి. లేదంటే కడుపు నొప్పి, చర్మంపై దురదలు, అలెర్జీలు వచ్చే అవకాశముంది. హెల్త్‌కి మంచిదని ఎక్కువ కాకుండా రోజుకు అరకప్పు క్వినోవా తీసుకుంటే సరిపోతుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.