హెల్త్ బెనిఫిట్స్ కోసం..

యాలకులను చాలామంది మౌత్​ ఫ్రెషనర్​గా ఉపయోగిస్తారు. అయితే దీనితో ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

మెరుగైన జీర్ణక్రియ కోసం

వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు..

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరంగా ఉంచుతాయి.

ఆర్థ్రైటిస్..

యాలకులను రెగ్యూలర్​గా తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది. ఆర్థ్రైటిస్ సమస్యలను దూరం చేస్తుంది. వాపు కూడా తగ్గుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

యాలకులను తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి లక్షణాలు దూరమవుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆస్తమా, బ్రోంకైటిస్ లక్షణాలు తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికై..

ఇది లిపిడ్ ప్రొఫైల్స్​ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ క్లాట్స్ కాకుండా హెల్ప్ చేసి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్​ని కూడా కంట్రోల్ చేస్తుంది.

ఒత్తిడి దూరం..

యాలకులు యాంగ్జైటీ, ఒత్తిడిని దూరం చేసి.. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. దీనిలోని యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి.

మరిన్ని బెనిఫిట్స్

బరువు తగ్గడంలో, డయాబెటిస్​ని దూరం చేయడంలో ఇది మంచి ఫలితాలు అందిస్తుంది. జుట్టు, స్కిన్​కి కూడా మంచి ప్రయోజనాలు అందుతాయి.

ఎన్ని తీసుకోవాలంటే..

ఒకటి నుంచి రెండు టీస్పూన్ల యాలకుల పొడి తీసుకోవచ్చు. లేదంటే రెండు లేదా మూడు యాలకులు తీసుకోవచ్చు.

వారు తీసుకోకూడదు..

ప్రెగ్నెంట్ మహిళలు, పిల్లలకు పాలిచ్చే మహిళలు నేరుగా తీసుకోకపోవడమే మంచిది. యాలకులు తినాలనుకునేవారు కచ్చితంగా వైద్యుల సూచనలు కచ్చితంగా తీసుకోవాలి.