ట్రావెల్లో వాంతులు అవుతున్నాయా? ఈ టిప్స్‌తో కంట్రోల్ చేయండి
బస్‌లో ప్రయాణించేప్పుడు ముందు లేదా మధ్యలో కూర్చోవాలి. చివర్లో కూర్చుంటే కుదుపులు ఎక్కువగా వచ్చి సమస్య పెరుగుతుంది. విండో దగ్గర్లో కూర్చుంటే మంచిది.
ట్రావెల్ చేసేప్పుడు ఎక్కువ మీల్స్ తీసుకోకపోవడమే మంచిది. లైట్ ఫుడ్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్‌ని ట్రావెల్‌కి ముందుకు తీసుకుంటే బెటర్.
ట్రావెల్ చేసేప్పుడు వాటర్ తాగుతూ ఉండండి. హైడ్రేటెడ్‌గా ఉంటే చాలా మంచిది. వాంటింగ్ ఫీలింగ్ తగ్గుతుంది.
జర్నీలో ఉన్నప్పుడు ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్‌ని తక్కువగా వినియోగిస్తే మంచిది. ప్రయాణంలో వీటిని ఎక్కువగా చూడడం వల్ల నిద్రరాదు. వాంతులయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది.
ప్రయాణానికి ముందు.. వైద్యులను కలిసి టాబ్లెట్స్ తీసుకుంటే మంచిది. ఇవి మోషన్ సిక్‌నెస్‌ను తగ్గిస్తాయి.
ప్రయాణంలో ఉన్నప్పుడు ఫిక్స్డ్ పాయింట్‌పై ఫోకస్ చేయాలి. కళ్లను ఊరికే తిప్పుతూ ఉంటే వాంతులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూర్చొనేప్పుడు సరైన పద్ధతిలో కూర్చొండి.
కార్లు లేదా బస్సులలో ప్రయాణించేప్పుడు క్లోజ్డ్గా ఉంటే సఫకేటింగ్గా ఉంటుంది. దీనివల్ల వాంతులయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఫ్రెష్ ఎయిర్ కోసం మీరు విండోలు ఓపెన్ చేసుకోవచ్చు.
చాలామంది వాంతులవుతాయని.. పూర్తిగా ఖాళీ కడుపుతో వెళ్లిపోతారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. జర్నీ చేసేప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాలి.
కార్లలో వినియోగించే స్ప్రేలు కొన్ని ఘాటైన వాసనను ఇస్తాయి. దీనివల్ల కూడా కడుపు తిప్పుతుంది.
కార్లలో ప్రయాణంచేప్పుడు గంటకో బ్రేక్ తీసుకోండి. దీనివల్ల ఫ్రెష్ ఎయిర్ అందుతుంది. ఈ మోషన్ సిక్నెస్ తగ్గుతుంది.
వాంతులను కంట్రోల్ చేసుకునేందుకు రిలాక్సింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వొచ్చు. డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ మంచి ఫలితాలు ఇస్తాయి.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.