ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రాన్స్‌జెండర్లు - ఒక్క అమెరికాలోనే 1.4 మిలియన్లు - ప్రపంచ జనాభాలో3 శాతం ఉండే చాన్స్ ఎల్జీబీటీల పేరుతో హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు -కొన్ని దేశాల్లో గుర్తించిన ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్లు అన్ని దేశాల్లో అనూహ్యంగా పెరుగుతున్న సంకేతాలు ట్రాన్స్‌జెండర్లు అంటే లింగ మార్పిడి ఆపరేషన్లు చేసుకున్న వారు మాత్రమే కాదు ! ఆడ లేదా మగ లా పుట్టి శరీర తీరు, మనస్థత్వాల్లో భిన్నమైన లింగంగా ఉన్న వారంతా ట్రాన్స్ జెండర్లే ! ఆడగా పుట్టి శరీర తీరు, ఆలోచనల్లో మగ లక్షణాలు ఉన్నా.. మగగా పుట్టి ఆడతనం ఉన్నా ట్రాన్స్ జెండర్లే ! కొంతమంది లింగమార్పిడి వ్యక్తులు మగ లేదా ఆడ లేదా మగ మరియు ఆడ కలయికగా మారుతారు ! సమాజంలో వారు ఇతరులతో కలిసి ఉండలేరు - కట్టుబాట్లు, అవమానిస్తారన్న కారణంగా దూరమైపోతారు ! ట్రాన్స్ జెండర్లు అన్నిరంగాల్లో ఉంటున్నారు. అందుకే ట్రాన్స్ జెండర్లు మూడో కేటగిరిగా గుర్తింపు పొందుతోంది.